– బాప్ రే బాప్.. భలే షాకిచ్చిన ఆప్
– మతి చలించిందా అన్న.. “మహా” నేత
– ఢిల్లీ కోటలో పాగాపై కేసీఆర్ ఆశలు ఆవిరి
– దేశ రాజకీయాల్లో శకుని పాత్రకు తహతహ
– ఎక్కే గడప..దిగే గడప..కానీ ఎవరూ నమ్మట్లే!
– ఫ్రంట్ షురూ కాకముందే.. టెంటు పీకిన సారు
– కేసీఆర్ ప్రధాని ఆశలకు ఆదిలోనే హంసపాదు
– అందితే జుట్టు..అందకుంటే కాళ్లు !
– కమలనాథులతో కాళ్లబేరమే ఖాయమా?
ప్రధాని కుర్చీ మీద మనసు పడ్డ తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ దిశగా చేయని ప్రయత్నం..కుయత్నం లేదనే చెప్పొచ్చు.దానిలో భాగంగానే వివిధ పార్టీల నాయకులను కలిసి..వాళ్ల ముందు తన అతి తెలివితేటలన్నీప్రదర్శించారు. అంతేనా..వాళ్లతో ఎంతో సన్నిహితంగా మంత్రాంగాలు జరుపుతున్నట్టు..వాళ్లు తనకు ఎంతో గుర్తింపు ఇస్తున్నట్టు..తనను ఒక జాతీయ నాయకుడిగా గుర్తిస్తునట్టు మీడియాలో కనిపించటానికి ఎన్నివేషాలు వేయొచ్చో అన్నీవేశారనేది రాజకీయ పండితుల విశ్లేషణ.ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే..ఏ రాష్ట్ర నాయకుడు కానీ..ఏ పార్టీ అధినేత కానీ కేసీఆర్ ను ఆహ్వానించలేదు.తనకు తానే అప్రకటిత జాతీయ నాయకుడిగా..థర్డ్ ఫ్రంట్ టెంట్ నిర్మాతగా ప్రకటించుకుని..వాళ్లను కాళ్లావేళ్లా పడి అపాయింట్ మెంట్లు తీసుకుని మరీ కలిసివచ్చారు.
ఇక ఎవరైనా హైదరాబాద్ వచ్చి కేసీఆర్ ను కలిసినా…దాని వెనకా కేసీఆర్ ప్రయత్నాలే ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ సాయంతోనే స్టాలిన్ అయినా, కేరళ సీఎం అళగిరి అయినా.. లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ అయినా..ఇలా ఎప్పుడూ ఎవరో ఒకరిని హైదరాబాద్ పిలిపించుకుని అందరూ తన నేతృత్వంలో ఒక్కటవుతున్నారనే బిల్డప్ ఇచ్చే కుయత్నం చేశారు.పీకే ఒత్తిడితో హైదరాబాద్ వచ్చి కేసీఆర్ తో భేటీ అయిన లాలూ తనయుడు తేజస్వీ యాదవ్ కు దొరగారు ఇచ్చిన ఆఫర్ ఏ మాత్రం నచ్చలేదని సమాచారం.నితిష్ కుమార్ తో కలిసి కేంద్రం మీద పోరాడాలన్న ఉచిత సలహా బుట్టదాఖలు చేసి వెళ్లిన తేజస్వి..మళ్లీ ఇప్పటిదాకా కేసీఆర్ మొహం చూస్తే ఒట్టు.
మమత, శరద్ పవార్, స్టాలిన్, అళగిరి, తేజస్వి.. ఇలా వివిధ రాష్ట్రాల నేతలంతా ఎవరి ఇంటిపోరులో వాళ్లుండటం.. మరోవైపు ఎవ్వరూ కేసీఆర్ మాయమాటలు నమ్మకపోవటంతో పాపం సారు ప్రధాని కల కలగానే మిగిలిపోయే పరిస్థితి దాపురించింది. మహారాష్ట్రలో అయితే.. మొదటికే మోసం వచ్చింది. సీఎం ఉద్ధవ్ థాక్రే..కేంద్రంపై యుద్ధమనే కేసీఆర్ ప్రతిపాదనను చూద్దాంలా అంటూ లైట్ గా తీస్కున్నట్టు సమాచారం.అటు.. దేశ రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ నేత..ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ఏకంగా ప్రెసిడెంట్ పదవినే ఎరగా చూపినట్టు తెలిసింది. దానికి ఆయన ..మన సారువారి మానసిక స్థితిపై ఆందోళన వెలిబుచ్చినట్టు తెలిసింది. ఇక వామపక్షాలకు భారీగా డబ్బు ఆశ చూపించినా.. అక్కడా మొండి చేయే. ఇలా ఎక్కడ పోతే అక్కడ ఎదురుదెబ్బలు..ఎవరూ వెంటరాని పరిస్థితి. వీటన్నింటికి తోడు తాజాగా .. తెలంగాణలో భారీ అవినీతి అంటూ.. పోరాడి తీరతామంటూ ఆమ్ ఆద్మీ పార్టీ భారీ ఝలకే ఇచ్చింది.
అట్టర్ ఫ్లాప్ షో..!
అందుకే… కేసీఆర్ అనుకున్నది ఒక్కటయితే.. జరుగుతున్నది మాత్రం మరొకటంటున్నారు విశ్లేషకులు. ఎంతమందిని కలిసినా.. సారువారికి ప్రతి చోటా చుక్కెదురే అయింది. అందుకే.. ఫ్రంట్ మొదలుపెట్టక ముందే టెంట్ పీకేసినట్టు ఆయనే స్వయంగా హింట్ ఇవ్వాల్సివచ్చిందంటున్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని గంపెడు ఆశలు పెట్టుకున్న గులాబీ బాస్ కు .. యూపీ జనం మళ్లీ యోగీకే పట్టం కడుతున్నారనే సంగతి అర్థమై… కేంద్రం తీసుకునే చర్యలపై భయం పట్టుకుందని అంటున్నారు. అందితే జుట్టు..అందకుంటే కాళ్లు పట్టుకునే విద్యలో ఆరితేరిన కల్వకుంట్ల వారు.. బీజేపీతో కాళ్లు పట్టుకునే ఫార్ములానే బెటర్ అనే నిర్ణయానికి వచ్చినట్టు ఆయన సన్నిహిత వర్గాలే చెప్తున్నాయంటున్నారు. ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. బీజేపీకి వ్యతిరేకంగా “మెగా” ప్రాజెక్టుల అవినీతి డబ్బును నీళ్లలా గుమ్మరించే గులాబీబాస్ పై బీజేపీ ఇప్పటికే గుర్రుగా ఉందట. దీంతో.. ఢిల్లీలో లాల్ ఖిలా మీద విహరిస్తున్న కేసీఆర్.. ఇప్పుడిప్పుడే భూమ్మీదకు దిగి వస్తున్నట్టు తెలుస్తోంది.
ఎక్కేగడప దిగే గడపలా ఎన్ని రాష్ట్రాలు తిరిగినా..పార్టీల అధినేతలను కలిసినా.. ఎవరూ తనను నమ్మక పోవటం కేసీఆర్ లో నిరుత్సాహాన్ని పెంచిందంటున్నారు. అటు.. వేల కోట్ల అవినీతిని కప్పిపుచ్చుకోవటానికి.. కేంద్రం మీద అవాకులు చవాకులు పేలటంతో.. వాళ్లు ఏ క్షణాన్నైనా తన మీద విరుచుకుపడటం ఖాయమనే సంకేతాలు కూడా వస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో కేసీఆర్ బృందం అవినీతికి సంబంధించిన ఫైల్సన్నీ పక్కా ఆధారాలతో సహా హోంమంత్రి అమిత్ షా టేబుల్ మీద ఉన్నాయని.. అటు..ఈడీ దగ్గర కూడా ఊ అనేదే ఆలస్యం దాడి చేయటానికి సరిపడినంత మెటీరియల్ ఉందని ఢిల్లీ వర్గాల సమాచారం. ఇవి చూచాయగా గులాబీ అధినేత దృష్టికి కూడా వచ్చాయట. అందుకే.. మూడో ఫ్రంట్ సంగతి దేవుడెరుగు.. మూడోసారి అధికారం దక్కించుకోగలిగితే అదే పదివేలని.. హస్తినతో కాళ్ల బేరానికి వచ్చినట్టు ఆయన సన్నిహితవర్గాలే చెప్తున్నాయి. అందుకే హిట్టవుతుందనుకున్న సారు సినిమా.. రిలీజ్ కాకముందే ఫట్టయిందనీ..ఇంకా చెప్పాలంటే ఫ్లాప్ షోగా మారిపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.