హైదరాబాద్:
తెలంగాణ ఎక్సైజ్ శాఖలో భారీ కుంభకోణం జరగబోతుందని సంచలన కామెంట్స్ చేశారు బీజేపీ సీనీయర్ నేత ఇంద్రసేనారెడ్డి. కేసీఆర్ కుటుంబం కన్ను ఇప్పుడు ఎక్సైజ్‌పై పడిందని, అందుకే కొత్త వ్యవస్థ పేరుతో కొత్త నాటకానికి తెరలేపారని ఆయన అంటున్నారు. ఎక్సైజ్ శాఖలో 5వేల కోట్ల కుంభకోణం జరగబోతుందని, దోచుకోవడానికే ఉన్న వ్యవస్థలను ఈ ప్రభుత్వం నాశనం చేస్తోందని విమర్శించారు. చెప్పినట్లు వింటున్నారు కాబట్టే సోమేష్‌కుమార్ అనే ఉన్నతాధికారికి వివిధ శాఖలను అప్పగిస్తున్నారని, సోమేష్‌కుమార్ మద్యం వ్యాపారులను బెదిరిస్తున్నాడని ఇంద్రసేనా చెబుతున్నారు.