నేను చెప్పిందేంటీ, మీరు చేస్తున్నదేమిటీ… చూసి రమ్మంటే కాల్చి రావాలి గానీ, మొత్తం నాశనం చేశారు అంటూ కేకే, నామాలపై ఫైర్ అయ్యారట కేసీఆర్. హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతివ్వాలని సిపిఐ వద్దకు తన బృందాన్ని పంపించారు కేసీఆర్. అసలు టీఆర్ఎస్ మద్దతు అడుగుతుందని సిపిఐ సహా ఎవరూ ఊహించనే లేదు. అక్కడే అందర్నీ డిఫెన్స్‌లోకి నెట్టి… ఎంతో కొంత బలం ఉన్న సిపిఐతో గట్టెకొచ్చన్నది కేసీఆర్ ప్లాన్. పైగా మనం అడిగాక… తోక మందంలేని సిపిఐ కాదనటమా అంటూ కేసీఆర్ అంచనాతో కేకే బృందాన్ని పంపారు. కానీ అక్కడ చర్చల్లో సిపిఐ చాడ వెంకట్‌రెడ్డిని కేసీఆర్ బృందం పూర్తిగా ఒప్పించలేకపోయింది. బయటకు వచ్చి మీడియాకు తాము టీఆర్ఎస్‌కు మద్దతిస్తున్నామని చెప్పించాలని కేసీఆర్ వ్యూహాం. కానీ చాడ పూర్తిగా కేసీఆర్ మాయలో పడకుండా… పార్టీలో చర్చించి నిర్ణయం అని మాత్రమే చెప్పారు.
దాంతో… తమ ప్లాన్ పూర్తిగా వర్కవుట్ కాలేదని కేకే, నామాలపై కేసీఆర్ ఫోన్‌లోనే మండిపడ్డారని తెలుస్తోంది.