యూనియన్ల విషకౌగిలిలో… యునియన్‌ల అరాచకంతో లాభాల్లోకి వస్తారా అంటూ తీవ్రమైన పదజాలంతో ఆర్టీసీ మనుగడ ఉండదంటే ఉండదని స్పష్టం చేశారు కేసీఆర్. నాలుగేండ్లలో 67శాతం జీతాలు పెంచినా కార్మికులు వినకపోతే ఏం చేయాలని ప్రశ్నించారు. ఆర్టీసీ అప్పుల్లో ఉందని… జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, నాలుగు బస్టాండ్లు అమ్మి జీతాలు ఇచ్చే పరిస్థితి ఉందన్నారు.
దీనిపై కార్మిక సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. నష్టాల పేరుతో ఆర్టీసీని మూసే ప్రక్రియను కేసీఆర్ అధికారికంగా ప్రకటించారని, ఎలుకలున్నాయని ఇళ్లు తగలబెట్టుకుంటామా అని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్న అహంకారంతో మాట్లాడుతున్నారని… ఇది మంచిది కాదని అభిప్రాయపడుతున్నారు.