విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం లో నాలుగు రోడ్ల కూడలిలో తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫ్లెక్సీ ను ఏర్పాటు చేశారు. లాలం చందు, లాలం కన్నాజి అనే ఇద్దరు సోదరులు స్నేహపూర్వకంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశామని తెలిపారు. కేసీఆర్ ఇలాగే వందేళ్లు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేకూరుస్తూ ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యవంతంగా ఉండాలని ఫ్లెక్సీ ఏర్పాటు చేసినట్లు లాలం కన్నాజీ తెలిపారు. ఫ్లెక్సీ ఏర్పాటులో ఎలాంటి రాజకీయ కోణం లేదంటూ చెప్పుకొచ్చారు.
Tolivelugu Latest Telugu Breaking News » Viral » విశాఖ లో కేసీఆర్ ఫ్లెక్సీ