డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.మాదక ద్రవ్యాలను విక్రయించే కెల్విన్ ను 2017 జులై లో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసారు.ఎక్సైజ్ పోలీసుల విచారణలో కెల్విన్ అనేక విషయాలు వెల్లడించాడు.వాటి ఆధారంగా నాటి ఎక్సైజ్ కమిషనర్ అకున్ సబర్వాల్ పూర్తి స్థాయి విచారణ చేపట్టాడు.తాను డ్రగ్స్ ఎవరెవరికి సరఫరా చేసింది, ఎక్కడెక్కడ సరఫరా చేసింది కెల్విన్ పూస గుచ్చినట్లు చెప్పాడు. ఆ సమాచారం ఆధారంగా అకున్ సబర్వాల్ సినీ ప్రముఖులు చాలామందిని విచారించారు.ఇది ఎటెటో వెళుతుందని గ్రహించిన కొందరు సినీ ప్రముఖులు ప్రభుత్వ పెద్దల పై ఒత్తిడి తేవడంతో విచారణ ఉన్నపళంగా ఆగిపోయింది. అకున్ సబర్వాల్ ను కమిషనర్ నుండి రిలీవ్ చేసి కేంద్ర సర్వీస్ లోకి పంపడం జరిగింది. అప్పటి నుండి డ్రగ్స్ కేసు కోల్డ్ స్టోరేజ్ లో వుంది. తాజాగా బెంగళూరులో డ్రగ్స్ పట్టుబడడం దాని పై బెంగళూరు పోలీసులు సీరియస్ గా విచారణ చేపట్టడం జరిగింది.వారి విచారణలో సినీ ప్రముఖుల పేర్లతో పాటు ఒకరిద్దరు టీఆరెస్ ఎం ఎల్ ఏల పేర్లు కూడా బయటకు వచ్చాయి.ఆ లింక్ ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది.దీని మూలాలు హైద్రాబాద్ లో ఉన్నాయని తెలిసి ఈడీ హైద్రాబాద్ వచ్చిసినీ ప్రముఖులను విచారించింది.నాడు విచారణ ఎదుర్కోని రకుల్ ప్రీత్ సింగ్, రానా లను కూడా ఈడీ విచారించింది. దీనితో మరోసారి డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది.
ఇదంతా ఇదంతా ఇలా ఉంటే కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి డ్రగ్స్ కేసు పై మొదటి నుండి న్యాయ పోరాటం చేస్తున్నారు.డ్రగ్స్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని ఈడీ రంగంలోకి దిగాలని కోరుతూ హై కోర్టు లో పిల్ వేయడం జరిగింది.రేవంత్ వేసిన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేస్తూ ఈడీ విచారించాల్సిన అవసరం లేదని చెప్పింది.మా దగ్గర వున్న ఎలాంటి ఆధారాలు ఇవ్వబోమని తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని ఈడీ కూడా న్యాయస్థానానికి తెలియజేసింది. దీంతో డ్రగ్స్ కేసు రాజకీయ రంగు పులుముకుంది. సినీ ప్రముఖులను రక్షించేందుకే కేసీఆర్ సర్కార్ డ్రగ్స్ కేసును ఈడీకి అప్పచెప్పడంలేదనే విమర్శలు వచ్చాయి. లేదంటే కేసీఆర్ సర్కార్ ఎందుకు భయపడుతుంది అనే చర్చ కూడా వుంది. సినీ ప్రముఖులను రక్షించే బాధ్యతను కేటీఆర్ తీసుకున్నాడని కాంగ్రెస్ ఆరోపించింది.తాజాగా ఈడీ విచారణ నేపథ్యంలో మరోసారి రాజకీయ దుమారం లేచింది. కేటీఆర్ రేవంత్ రెడ్డి ల మధ్య సవాల్ ప్రతి సవాల్ తో పొలిటికల్ హీట్ ఎక్కింది.రాజకీయ సవాళ్ళను పక్కన పెడితే నాలుగేళ్లుగా డ్రగ్స్ కేసు ను కోల్డ్ స్టోరేజ్ పెట్టిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఈడీ విచారణ నేపథ్యంలో హడావుడిగా చార్జ్ షీట్ దాఖలు చేయడం నాలుగేళ్ల కిందట సేకరించిన శాంపిల్స్ రిపోర్ట్స్ ఇప్పుడు బయట పెట్టడం సినీ ప్రముఖులకు క్లిన్ చిట్ ఇవ్వడం పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొదటి నుండి డ్రగ్స్ కేసుపై దాని విచారణ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తాజాగా రంగారెడ్డి కోర్ట్ లో చార్జిషీట్ వేయడం,శాంపిల్స్ చూస్తుంటే ఏదో జరుగుతుంది అనే అనుమానం వస్తుంది. ఇదంతా గమనించే కాంగ్రెస్ ఎవరినో రక్షించే ప్రయత్నం జరుగుతుంది అని ఆరోపిస్తుంది. లేదంటే నాలుగు సంవత్సరాలుగా సైలెంట్ గా వున్న ఎక్సైజ్ శాఖ ఇప్పుడు మేల్కొని హడావిడిగా చార్జిషీట్ వేసి కెల్విన్ చెప్పిన వాటిని పరిగణనలోకి తీసుకోలేమని చెప్పడం శాంపిల్స్ సేకరణలో క్లిన్ చిట్ ఇవ్వడం చూస్తుంటే సంథింగ్ రాంగ్ అంటున్నారు. డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది ఎటు దారి తీస్తుందో ఎవరి మెడకు చట్టుకుంటుందో వేచి చూడాలి.