52 రోజుల అధికారిక సమ్మె, ఆ తర్వాత మేము సమ్మె విరమిస్తున్నాం అంటూ కార్మికుల ప్రకటన… అయినా ప్రభుత్వం చేర్చుకోకపోవటంతో కార్మికుల భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. అయితే… కార్మికులంతా డిపోల వద్దకు వెళ్లి మేం పనిలో చేరుతాం అని ప్రాదేయపడ్డా… ఆర్టీసీ యాజమాన్యం చేర్చుకోవటం లేదు.
మరోవైపు రెండ్రోజుల మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. గురువారం మద్యాహ్నం 2గంటలకు ప్రగతి భవన్‌లో భేటీ కానుంది. అవసరమైతే ఈ మంత్రివర్గ సమావేశాన్ని శుక్రవారం వరకు పొడిగించే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రకటన చేసింది.
అయితే… ఈ రెండ్రోజుల రికార్డ్ మంత్రివర్గ భేటీలో ఆర్టీసీ భవితవ్యాన్ని తేల్చాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు ఆర్టీసీకి ఎంత అప్పు ఉంది, ఎన్ని ఆస్తులున్నాయి… ఆర్టీసీని తిరిగి కంటిన్యూ చేయగలమా…? చేస్తే ఎంత డబ్బు అవసరం…? కార్మికులను ఏం చేద్ధాం అనే నిర్ణయాలపై అన్ని నిర్ణయాలను తీసుకునే అవకాశం కనపడుతోంది.