సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కార్ ఎప్పుడైనా పడిపోవచ్చని, వచ్చే రెండు సంవత్సరాలు ఉండటం కష్టమేనంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక, గ్రేటర్ లో ప్రయోగించిన బీజేపీ వ్యాక్సిన్ ఫలించిందని, ఇక ఖమ్మంపైనే తమ నెక్ట్స్ ప్రయోగం అంటూ స్పష్టం చేశారు.
ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేసి తీరుతామన్న బండి సంజయ్… ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ తో కలిసి ఖమ్మంలో పర్యటించారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడపై నిప్పులు చెరిగారు. నాలుగు సంవత్సరాల్లో నాలుగు పార్టీలు మారిన మంత్రి పువ్వాడ… మాకు నీతులు చెప్తున్నారని, అక్రమ భూములను రెగ్యూలర్ చేయించుకోవటానికే టీఆర్ఎస్ లో చేరావ్ అంటూ మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని, మీ అక్రమాల చరిత్ర బయటపెడుతాం అంటూ హెచ్చరించారు.