మంత్రులు దగ్గర పనిచేసేవారికి జాబ్ గ్యారంటీ ఉందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే జరిగిన, జరుగుతున్న పరిణామాలు దీనినే నిర్ధారిస్తున్నయి. ఇటీవల ఒక కీలక మంత్రి దగ్గర నమ్మకస్థుడిగా గత అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న డ్రైవర్ ని తీసేసారు.దీనికి కారణం ముఖ్యమంత్రి అదేశాలని తెలిసింది.
మంత్రులు, ఎమ్మెల్యేల దగ్గర పనిచేసే డ్రైవర్లను తప్పు చేస్తే పంపించేస్తుంటారు. లేదా నోటి దురుసుగా ప్రవర్తించినా, ఇంట్లో బిహేవియర్ బాగాలేకపోతే తీసేస్తారు. కానీ సీఎం చెప్పాడని మంత్రిగారు… తన నమ్మకమైన వ్యక్తిని తీసేశారు. ఎందుకు ఆ డ్రైవర్ పై సీఎం కేసీఆర్ ఫోకస్ పడింది అంటే… సదరు డ్రైవర్ మొబైల్ నెంబర్ ఇంటిల్జెన్సీవారు ట్యాపింగ్ చేసారు. చాలాకాలంగా అతని ఫోన్ ట్యాపింగ్లో ఉన్న సంగతి అతనికి కానీ ఆ మంత్రికి కాని తెలిసినట్లు లేదు. అలా అని ఆ డ్రైవర్ ఏదో రహస్యాలు మాట్లాడింది కూడా ఏమిలేదు. కాకపోతే తను పనిచేస్తున్న మంత్రిగారి మీద ప్రభుభక్తి చాటుకుంటూ తన మిత్రుల దగ్గర కొంతమంది టీఆరెస్ నాయకుల గురించి, ఫోన్ సంభాషణ చేసాడు. ఒక అడుగుముందుకేసి మా సార్ కు ఎప్పటికయినా ఉన్నత స్థానానికి వెళతాడు అని తన అభిమానాన్ని చాటుకున్నాడు. అదే ఆ డ్రైవర్ చేసిన నేరం. అది మన సీఎం గారికి నచ్చలేదు… అంతే మంత్రిపదవి ఇస్తూనే ముందు నీదగ్గర ఉన్న డ్రైవర్ ని తీసేయ్ అని ఆర్డర్ పాస్ చేసాడు. చేసేదిలేక మంత్రి ఆ డ్రైవర్ని రేపటినుండి రావొద్దని చెప్పాడు. పాపం చేయని తప్పుకు ఉద్యోగం పోగొట్టుకున్నాడు.
కేవలం తాను పనిచేస్తున్న సార్ బాగుండాలని ఆయన పడ్డ కష్టానికి తగ్గ గుర్తింపు రాలేదని, ఎప్పటికయినా ఆయనకు మంచి అవకాశాలు రావాలని… వస్తాయని ఆశపడ్డాడు. ఇదే విషయం కొందరి దగ్గర వ్యక్తంచేసాడు. మా మంత్రికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. పార్టీకోసం కష్టపడ్డ వ్యక్తికి అన్యాయం చేయడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతే ఫోన్ ట్యాపింగ్ లో ఇదంతా విన్న ఇంటెలీజెన్సీ వారు ముఖ్యమంత్రి కి చేరేశారు. అంతే ఆయన మంత్రిపదవి స్వీకరిస్తూ ప్రమాణస్వీకారం చేయగానే పిలిచి నీదగ్గర పనిచేసే డ్రైవరును తీసేస్తే మంచింది అని చెప్పారు. అత్యంత నమ్మకంగా కష్టపడేవాడిని రోజుకు24 గంటలలో 18,19 గంటలు అత్యంత జాగ్రత్తగా సురక్షితంగా నడిపే వ్యక్తిని కేవలం డ్రైవర్ లాగా కాకుండా కుటుంబసభ్యుడి గా ఉన్న అతనిని తీసేయాల్సి రావడం కొంతభాదగా ఉన్న తప్పలేదు. దీనిని బట్టి మంత్రుల దగ్గర పనిచేసే వారి డ్రైవర్ల దగ్గర నుండి అటెండెర్స్, పిఏ,పీస్,గన్ మెన్ల మొబైల్లతో సహ ఇతర సిబ్బంది ఫోన్లు కూడా ట్యాపింగ్ లో ఉన్నాయని అర్ధం అవుతుంది. ఈ విషయం తెలియడంతో మంత్రులు వారి దగ్గర పనిచేసే వారు ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అని భయపడి చస్తున్నారు.
ఇదిలా ఉంటే రాజకీయవర్గాలు మాత్రం కేసీఆర్‌కి మంత్రులతో భయం పట్టుకుందని, అందుకే సొంతపార్టీ నేతలతో పాటు విపక్షనేతల ఫోన్లు కూడా చాలాకాలంగా ట్యాపింగ్ చేయిస్తున్నాడని అంటున్నారు. అందుకే మంత్రులు, టిఆరెఎస్ నాయకులు వాట్సాప్ కాల్స్ లో మాట్లడుకుంటున్నారని చెప్పుకొస్తున్నారు. ఇది గమనించిన కేసీఆర్ వాట్సాప్ కాల్స్ ట్యాపింగ్ గురించి కూడా ఆలోచిస్తున్నాడని, ఇప్పటికే వాట్సాప్ మెసేజ్ లు ప్రింట్ తీసేవిధంగా అఫీషియల్ గా ఆర్ధిక శాఖ నుండి నిధులు జారీ చేసి మరి మిషన్ ఒకటి కొనుగోలుచేసారని చెప్పుకుంటున్నారు. మొత్తానికి ఇప్పుడు మంత్రులలో, టీఆర్ఎస్ నాయకులలో, మంత్రి దగ్గర పనిచేసే సిబ్బందిలో భయం వెంటాడుతుంది.