ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగమే కాదు కనీసం పనిచేసిన రోజులకు కూడా జీతం ఇచ్చేలా లేదు ప్రభుత్వం. ఆర్టీసీ కార్మికుల సెప్టెంబర్ నెల జీతాలపై ప్రభుత్వం చేస్తున్న వింత వాదన చూస్తుంటే ఎగ్గొట్టే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందన్న ఆరోపణలే వస్తున్నాయి.
రైతుకు బీమా ఇవ్వని కేటీఆర్ హామీ
గతంలో తమ వద్ద సరిపడా నిధులు లేవని చెప్పిన ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం… తాజాగా వింత వాదనను తెరపైకి తెచ్చింది. పేమెంట్ ఆఫ్ పేజెస్ యాక్ట్ 7 ప్రకారం ఒక రోజు విధులకు హజరు కాకుంటే 8 రోజుల జీతం కట్ చేయొచ్చునని ప్రభుత్వం తరుపు న్యాయవాది వాదించారు. కార్మికులు యాభై రెండు రోజులుగా సమ్మెలోనే ఉన్నారని, అందుచేత సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించలేమని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు వాదనలు వినిపించారు.
టీఆర్ఎస్ మంత్రి ఇంట్లో ల్యాండ్ సెటిల్‌మెంట్… వీడియో
తక్షణమే పనిచేసిన కాలానికి జీతాలు చెల్లించే విధంగా ఆర్డర్ ఇవ్వమని కార్మికుల తరఫు న్యాయవాది హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం విచారణ వచ్చే బుధవారానికి వాయిదా వేశారు.
దాదాపు 52 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉండగా… ఆగస్టు నెలలో పడిన జీతంతోనే కార్మికుల కాలం గడుపుతున్నారు.