ప్రగతి భవన్ ను ఎన్.ఎస్.యూ.ఐ ముట్టడించిన కేసులో కేసీఆర్ మనువడు తెరమీదకు వచ్చాడు. దాదాపు 37మంది ఎన్.ఎస్.యూ.ఐ కార్యకర్తలు ప్రగతి భవన్ ను ముట్టడించి, రాష్ట్రంలో ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ వాయిదా వేయాలని, కరోనా వైరస్ ఉధృతి సమయంలో పరీక్షలు మంచిది కాదని వారు ఆరోపించారు.

అయితే ఈ ముట్టడిలో సీఎం కేసీఆర్ అన్న కుమార్తె రమ్యారావు కొడుకు రితేష్ రావు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు రితేష్ రావును ఏ5 గా కేసులో చేర్చారు. అరెస్ట్ చేసిన వారికి కోర్టు 14రోజుల రిమాండ్ వేయటంతో అందర్నీ చంచల్ గూడ జైలుకు తరలించారు.
ఈ అరెస్ట్ పై సీఎం కేసీఆర్ అన్న కూతురు, కాంగ్రెస్ పార్టీ నేత రమ్యారావు మండిపడ్డారు. ఆస్తుల కోసమో, కమిషన్ల కోసమో ఎన్.ఎస్.యూ.ఐ కార్యకర్తలు అడగలేదని… విద్యార్థుల ప్రాణాలను కాపాడలన్న ఉద్దేశంతోనే వారు ఆందోళన చేశారన్నారు.