విజయశాంతి, బీజేపీ సీనియర్ నేత
తెలంగాణలో మహిళలకు భద్రత లేకుండా పోయింది. మహిళలు, యువతులు బయట తిరిగే పరిస్థితి లేదు. సింగరేణి కాలనీలో దారుణమైన ఘటన జరిగినా ముఖ్యమంత్రి రాకపోవడం సిగ్గుచేటు. కేసీఆర్ కు సీఎంగా కొనసాగే హక్కు లేదు. చట్టాలను మార్చాల్సిన అవసరం ఉంది. ఈ అంశాన్ని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్తాం.
రాజు డెడ్ బాడీని బాధిత కుటుంబానికి చూపించాలి. కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. రాష్ట్రంలో కేసీఆర్ సీఎంగా ఉన్నంత వరకు ఆడపిల్లలకు రక్షణ లేదు. ఉదయం ఆరు గంటలకు వచ్చి డబ్బులు ఇచ్చి నోరు మూసేద్దామనుకోవడం సమంజసం కాదు. స్థానికంగా ఉన్న సమస్యలపై ఉద్యమం చేయడానికి సిద్దంగా ఉన్నాం.