హైదరాబాద్: చింతమడక…పేరులోనే ‘చింత’ ఉంది. ఈ ఉరి చిన్నోడే రాజకీయ పెద్దోడై తెలంగాణ ఏలుతున్నాడు. ఇక చింతలు తీరవా…! అని అంతా అనుకున్నారు. సీన్ కట్ చేస్తే.. చింతమడక అలానే వుంది. ఆ ఊరి చింతలూ అలానే ఉన్నాయి. గత ఐదేళ్లలో అక్కడ డెవలప్‌మెంట్ నథింగ్..!!
కేసీఆర్ సీఎం అయ్యాక చింతమడక గ్రామానికి 2014 నుంచి ఇప్పటి దాకా ఎన్ని నిధులు మంజూరు అయ్యాయని ఒకరు ఆసక్తిగా ఆర్.టి.ఐ. పిటిషన్ వేశారు. కేవలం రూ.1.10 లక్షలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చాయని, ఐదేళ్లలో కేంద్రం నుంచి 47.19 లక్షలు మంజూరు అయ్యాయని సమాధానం వచ్చింది. ఇంతకూ పన్నుల రూపంలో గ్రామస్తులు చెల్లించింది అక్షరాలా రూ. 8.24 లక్షలు. కేసీఆర్ సీయం అయ్యాక అక్కడ ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదట…!! ఇదీ చింతమడక తీరు…!!
ఇటీవల సీఎం కేసీఆర్ గ్రామంలో పర్యటించి వరాల వాన కురిపించారు. ప్రతి ఇంటికి 10 లక్షల లబ్ది చేకూరుస్తానని హామీ ఇచ్చారు. అందరికీ ఇళ్లు, అద్భుతమైన రోడ్లు ఇంకా వద్దంటే అభివృద్ధి పనులు … ఇలా ఎన్నో వరాలు ప్రకటించారు. ఇవన్నీ అమలవుతాయా…? చింతమడక చింతలు తీరతాయా..? అంతా … కేసీఆర్ దయ…! జనం ప్రాప్తం…!!