రాబోయే మున్సిపల్ ఎన్నికలు టీఆర్ఎస్‌లో గుబులు రేపుతున్నాయి. ఇప్పటికే పార్టీలో అసమ్మతుల గోల ఎక్కువైంది. గులాబీ బాస్‌ను టార్గెట్ చేస్తూ బహిరంగంగానే కొందరు నేతలు కామెంట్ చేస్తున్నారు. రెండవసారి అధికారంలోకి వచ్చాక ప్రజల్లో కూడా కేసీఆర్ ఇమేజ్ భారీగా పడిపోయింది. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు గులాబీకి అనుకూలంగా రాకపోతే కారు రివర్స్ గేరులో వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కేసీఆర్‌పై చాలామంది తిరుగుబాటు చేసినా ఆశ్చర్యం లేదు. అందుకే కేసీఆర్ మున్సిపల్ ఎన్నికల కోసం ఇప్పటి నుంచి ప్రజలను మచ్చిక చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు.
యురేనియం తవ్వకాలకు మొదట అనుమతులు ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం, తరువాత వెనక్కి తగ్గడానికి మున్సిపల్ ఎన్నికలు ఒక కారణంగా కనిపిస్తున్నాయి. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు నిరసన కార్యక్రమాలకు పిలుపివ్వడంతో ప్రజల్లో కూడా యురేనియం తవ్వకాలపై వ్యతిరేకత వచ్చింది. దీంతో ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత ఉంది. దానికి యురేనియం సమస్య కూడా యాడ్ అయితే టీఆర్ఎస్‌కు మున్సిపోల్‌లో ఇబ్బందులు తప్పవు, అందుకే తనకు ఏమీ తెలియనట్లు చెప్పి అంతా కేంద్రమే చేస్తోంది.. అని చేతులు దులుపుకునే పని చేశారు సీఎం కేసీఆర్. తప్పును కేంద్రంపై వేసి తాను తప్పించుకోవాలని ప్లాన్ చేశారు. ఇక ట్రాఫిక్ చలాన్ల విషయంలో కూడా వెనక్కి తగ్గారు, ట్రాఫిక్ చలాన్ విషయంలో మొదట కేంద్ర నిర్ణయానికి మొగ్గు చూపిన కేసీఆర్ ఇప్పుడు మాత్రం ప్రజలకు ఇబ్బంది అవుతోందని ప్రకటనలు చేస్తున్నారు. ఈ బడ్జెట్‌లో సంక్షేమానికి భారీగా కోతలు పెట్టారు. గత 6 సంవత్సరాలు ఆర్థిక క్రమశిక్షణ లేక తెలంగాణ ఆర్టిక పరిస్థితి గందరగోళంగా తయారైంది, తెలంగాణ తలకు మించి అప్పులు చేసిందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి, దీంతో తప్పు తనది కాదని, ఆర్థిక మాంద్యం వల్లే ఇదంతా ఎదురైందని ప్రజలను నమ్మించి ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా కేసీఆర్‌కు మున్సిపోల్ భయం పట్టుకుంది. అందుకే ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో ఉన్నారు.