ఉద్యమాల నుండి వచ్చిన నేత, వరుసగా గెలుస్తూ వచ్చిన నాయకుడి మరణంతో అసెంబ్లీ సీటు ఖాళీ అయితే పరిస్థితి ఎలా ఉంటుంది…? ప్రతిపక్షాలు అభ్యర్థిని పెట్టేందుకు కూడా జంకాల్సింది పోయి టీఆరెస్ కు ముచ్చెమటలు పట్టిస్తున్నాయా..? కేసీఆర్ చెప్పిన లక్ష మెజారిటీ మేకపోతు గాంబిర్యమేనా..?
దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూలు విడుదల అయ్యేందుకు దాదాపు నెల సమయం ఉంది. ఎమ్మెల్యే మరణంతో వచ్చిన ఎన్నికలో సానుభూతి పవనాలు, అధికార పార్టీకి ఉండే సానుకూలత, ప్రత్యర్థి పార్టీలో నాయకుడి లేమి… ఇలా ఎన్నో అడ్వాంటేస్ ఉన్నా అధికార టీఆరెస్ మాత్రం బయపడుతున్నట్లు కనపడుతుంది. మంత్రి హరీష్ రావు కరోనా వచ్చి క్వరెంటాయిన్ అయినా ఉప ఎన్నిక భయంతో స్థానిక నేతలతో చర్చలు జరపడం మాత్రం ఆపలేదు. ఇక దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు టీఆరెస్ ఇప్పటికే ఇంఛార్జీలుగా ఎమ్మెల్యేలను నియమించింది. ప్రస్తుతం వీరంతా స్థానిక అసంతృప్తి నేతలతో చర్చలు జరుపుతూ…. బుజ్జగిస్తున్నారు. ఓ వైపు కాంగ్రెస్,బీజేపీ లు ప్రచారం మొదలు పెట్టిన, టీఆరెస్ మాత్రం సొంత పార్టీ నేతలను కూల్ చేసే పనిలో పడిపోయింది.
ప్రస్తుతానికి మండలానికి ఒక్క ఎమ్మెల్యే టీఆరెస్ ఇంచార్జి గా ఉండగా…. షెడ్యూల్ వచ్చే నాటికి మండలానికి ఒక్క మంత్రి రాబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇంతలా ఎమ్మెల్యేలు పని చేస్తున్నప్పటికీ, టీఆరెస్ నుండి అసలు ఎవరు పోటీ చేస్తారు అన్నది మాత్రం క్లారిటీ లేదు. అసంతృప్తి నేతలను కూల్ చేసాకే పార్టీ అభ్యర్థిని ప్రకంటించే అవకాశం ఉంది.