ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ.. ఈసారి ప్రభుత్వానికి తప్పేలా లేదు. ఇన్నాళ్లుగా అప్పుడూ, ఇప్పుడూ అంటూ వేతన సవరణ సంఘం(PRC) గడువు పొడిగించుకుంటూ వచ్చిన సర్కార్‌కు.. ఈ సారి ఏదో ఒక ప్రకటన చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. పీఆర్‌సీ గడువు ఈ నెలాఖరుతో ముగుస్తోంది. అయితే ఈ సారి గడువును మళ్లీ పొడిగించాలని భావిస్తే మాత్రం అంగీకరించేందుకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సిద్ధంగా లేవు. ఇప్పటికే కేసీఆర్ కనుసన్నల్లు నడుచుకుంటున్నారన్న అభియోగాలను ఉద్యోగ సంఘాలు ఎదుర్కొంటున్నాయి. దీంతో వారు కూడా ఫిట్‌మెంట్‌పై క్లారిటీ కోరుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఇటీవల ప్రభుత్వానికి ఎన్నికల్లో వరుస దెబ్బలు తగులుతున్న దృష్ట్యా.. ఉద్యోగుల నుంచి కూడా వ్యతిరేకత మూటగట్టుకోవద్దని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. వేతన సవరణ సంఘం నుంచి నివేదిక తెప్పించుకొని ఎంతో కొంత ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలని ఆలోచిస్తున్నట్టుగా అధికార వర్గాలు చెప్తున్నాయి. కరోనా దృష్ట్యా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా… ఫిట్‌మెంట్‌పై సానుకూల ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.