ఆర్టీసీ విషయంలో కేసీఅర్ సెల్ఫ్ గోల్ చేసుకుంటాడా…? పరిస్థితి చూస్తే అలాగే అనిపిస్తుంది. కార్మికులు డ్యూటీలోకి చేరాల్సిన సమయం మరికొద్ది గంటలలో ముగియనున్న నేపథ్యంలో ఇప్పటివరకు చేరిన కార్మికుల సంఖ్య చూస్తే చాలా నామమాత్రంగా ఉంది. ఈ కొద్ది గంటలలో పెద్దగా చేరే అవకాశాలు కూడా కనబడటంలేదు. ఇప్పటి వరకు చేరిన కార్మికుల సంఖ్య చూస్తే కేసీఅర్ కి అవమానమే అని చెప్పక తప్పదు.
ఈ ఎపిసోడ్ లో కేసీఅర్ సెల్ఫ్ డిస్మిస్ చేసుకున్నట్లే అంటున్నారు రాజకీయ వర్గాలు. కార్మికులను సెల్ఫ్ డిస్మిస్ అన్న కేసీఅర్ తాను సెల్ఫ్ డిస్మిస్ చేసుకున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. కేసీఆర్ పెట్టిన గడువు ముగిసిన తరువాత మిడ్ నైట్ మసాలా ఏముంటుందో చూడాలి అంటున్నారు. తాను పెట్టిన గడువుకు స్పందన లేకుంటే తెలంగాణ సమాజంలో తాను స్పృష్టించుకున్న, పెంచుకున్న ప్రతిష్ట దిగజారడం ఖాయం అన్న భావనకు కేసీఅర్ రాక తప్పదు అంటున్నారు. అదే జరిగితే తాడు కుడా పాము అయ్యి కరుస్తుంది… ఆర్టీసీ కార్మికులకు తోడుగా రెవెన్యూ ఉద్యోగులు కూడా పోరుబాట పట్టడం ఖాయం. అదే భాటలో మరికొన్ని సంఘాతు కూడా రోడ్డు ఎక్కుతారు అంటున్నారు.
ఇప్పటికే ఆర్టీసీ కార్మికుల పోరుబాటకు విపక్షాలు బాసటగా నిలిచాయి. భవిష్యత్ లో మరింత దూకుడుగా విపక్షాలు వ్యవహరిస్తాయి అంటున్నారు విశ్లేషకులు. దీంతో కేసీఆర్‌కు తలనొప్పి తప్పదు అంటున్నారు. కేసీఅర్ అనవసర ప్రెస్టేజ్ కి పోయి ఏరికోరి కష్టాలను తెచ్చుకోవడమే అని అంటున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్‌కు అహంకారం ఎక్కువయిందని… ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం అంటున్నారు. సొంత పార్టీ వాళ్ళు సైతం ఆఫ్ ది రికార్డ్ ఈ విషయాన్ని ఒప్పుకుంటున్నారు. క్యాబినెట్ ఏర్పాటు చేసే విషయం దగ్గర నుండి హరీష్ రావుని పక్కన పెట్టే దాకా, హుజూర్ నగర్ ఉపఎన్నికలలో గెలవగానే అహంకారం మరింత నెత్తికి ఎక్కిందని, అందుకే ఆర్టీసీ సమ్మె పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు అని చెప్పుకొస్తున్నారు.
ఎప్పుడు లేనివిధంగా దండయాత్రకు వెళ్లినట్లు భారీ కాన్వాయ్ తో హూజుర్ నగర్ వెళ్ళడం ఇందులో భాగమేనని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం మంచిది కాదు అంటున్నారు. ప్రపంచ చరిత్రలో నియంతలకు ఏమైందో అందరికీ తెలిసిందే అని గుర్తు చేస్తున్నారు. కేసీఅర్ కూడా అహంకారంతో వ్యవహరిస్తే అందరికీ పట్టిన గతే పడుతుందని అని చెపుతున్నారు.