ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. నిన్న ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు హాజరైన ఆయన లక్నో నుంచి ఢిల్లీ చేరుకున్నారు.
వసంత్ విహార్‌లో నూతనంగా నిర్మిస్తున్న టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఆయన వెంట మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు సంతోష్ కుమార్, దీవకొండ దామోదర్ రావుతో పాటు పలువురు నేతలు ఉన్నారు.
ఈ సందర్భంగా పార్టీ కార్యాలయ నిర్మాణ పనులపై అక్కడ వున్న ఇంజినీర్లకు ఆయన పలు సూచనలు చేశారు. పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.
మరో రెండు మూడు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉంటారని తెలుస్తోంది. అక్కడ పలువురు నేతలను ఆయన కలుస్తారని తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీని ప్రకటించిన తర్వాత ఆయన ఢిల్లీలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.