ఓవైపు ఆర్టీసీ సమ్మెపై చర్చల కోసం కమిటీ, ఆర్టీసీ సంఘాలు రెడీ అయిపోయాయి. మరోవైపు హుజూర్‌నగర్ గెలుపు తర్వాత కృతజ్ఙత సభ అంటూ టీఆర్ఎస్ అధినేత రెడీ అయిపోయారు. సంఘాలను, కార్మిక నేతలపై తిట్ల దండకం ఎత్తుకున్న కేసీఆర్… ఈరోజు ఏం ఫైర్ అవుతారో అంటూ జనం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
హుజూర్‌నగర్ గెలుపుతో ఖుషీ ఖుషీగా ఉన్న కేసీఆర్… ఆర్టీసీ వాళ్లపై కొంచెం అయిన సాఫ్ట్ కార్నర్ చూపించకపోతారా అని అంతా భావించారు. కానీ రిజల్ట్ డే నాడే కేసీఆర్ ఆర్టీసీపై అంతెత్తున లేచారు. హుజూర్‌నగర్ గెలుపు కూడా మర్చిపోయి… ఆర్టీసీ కార్మిక సంఘాలు, నేతలే టార్గెట్‌గా తిడ్ల దండకాన్ని అందుకున్నారు. నోటికొచ్చినట్లు, తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. జర్నలిస్ట్‌లు నెగెటివ్ అడిగే ధైర్యం కూడా చేయలేదంటే కేసీఆర్ ప్రతాపం ఎవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే, ఈరోజు ఓ వైపు ఆర్టీసీతో చర్చల ప్రక్రియ మొదలవబోతుంది. డిమాండ్ల లిస్ట్‌తో ఆర్టీసీ సంఘాలు, లిమిటెడ్ లిస్ట్‌తో యాజమాన్యం రెడీ అయిపోయింది. ఇదిలా ఉంటే… హుజూర్‌నగర్‌లో కేసీఆర్ సభ పెట్టారు. హుజూర్‌నగర్‌పై వరాలు, ఉత్తమ్‌పై సెటైర్లు ఎలాగూ ఉంటాయి. అయితే, సమ్మెపై మరోసారి కేసీఆర్ రెచ్చిపోతారు అన్న చర్చ ఊపందుకుంది. సభలో ఆర్టీసీ కార్మికులు నిరసన తెలిపే అవకాశం ఉండటంతో… కేసీఆర్ మరోసారి నోరు పారేసుకోవటం ఖాయమని టీఆర్ఎస్ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
దీపావళి సీజన్‌లో కేసీఆర్ మరోసారి థౌజండ్ వాలా పేల్చబోతున్నారని సెటైర్లు వేస్తున్నారు సొంత పార్టీ లీడర్లు.