ఎందుకు ఇంత సడన్ గా కేసీఅర్ యూటర్న్ తీసుకున్నారు…. మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చాక కేంద్రంతో బాగుండాలని అనుకున్న కేసిఆర్ మోడీకి స్నేహ హస్తం అందించే ప్రయత్నం చేశారు. మోడీని కలిసి అభినందనలు కూడా చెప్పారు. మోడీ తీసుకొచ్చిన అనేక బిల్లులకు మద్దతు కూడా ఇచ్చారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్ ప్రత్యేక విమానంలో వెళ్లి మరీ ఆర్టికల్ 370 కి మద్దతుగా ఓటింగ్ లో పాల్గొన్న సందర్భంకూడా చూసాం. తలాక్ తలాక్ బిల్లుకు రైట్ టూ ఇన్ఫర్మేషన్ చట్ట సవరణ బిల్లుకు ఇలా కొన్ని బిల్లులకు మద్దతు ఇవ్వడం ద్వారా మోడీని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసిన కేసీఅర్ ఇప్పుడు షడన్ గా ఎన్ అర్ సి, క్యాబ్ లకు వ్యతిరేకంగా ఓటు వేయడమే కాకుండా ఎం ఐ ఎం తో కలిసి ఉద్యమం చేపట్టేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు.
హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ జరిపి దానికి సోనియాతో పాటు మోడీ వ్యతిరేక శక్తులను ఒక వేదికమీదకు తెచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నట్లు.. దీనివెనుక ఉన్న మతలం ఏమిటి అనే చర్చ సర్వత్రా జరుగుతుంది. దీనిపై ఎవరి విశ్లేషణ వారు చేస్తున్నారు. అయితే కేటీఆర్ ను సీఎం చేసేందుకు ఎత్తుకుంటున్న మార్గమని కొందరు చెప్పుకొస్తున్నారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగానే కేటీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కాంగ్రెస్, బీజేపీ లకు వ్యతిరేకంగా దేశంలోని వివిధ పార్టీలను ఒక వేదిక మీదకు తెచ్చే ప్రయత్నం చేశారు. కొన్ని పార్టీలకు ఎన్నికల ఫండింగ్ చేశారని కూడా ప్రచారం జరిగింది. అయితే కేసీఆర్ ఊహించింది ఒకటి జరిగింది మరొకటి. హంగ్ వస్తుంది అప్పుడు నేను చక్రం తిప్పొచ్చని ఆశించి భంగపడ్డరూ హంగ్ వచ్చి తాను కేంద్రానికి వెళితే కేటీఆర్ ను సీఎం ను చేయాలని కేసీఅర్ భావించాడు అని కొందరు విశ్లేషకులు చెపుతున్నారు. మోడీ రెండో సారి అధికారంలోకి వచ్చాక కేంద్రానికి దగ్గర కావాలని కేసిఆర్ భావించి బిల్లులకు కూడా మద్దతు ఇచ్చాడని మోడీ పాజిటివ్ గాలేకపోవడంతో ఇప్పుడు క్యాబ్ ఎన్ ఆర్ సి లకు వ్యతిరేకంగా దేశంలోని మోడీ వ్యతిరేకులను ఒక వేదిక మీదకు తెచ్చి జాతీయనాయకుడు కావడం ద్వారా ఇక్కడ కేటీఆర్ ను సీఎంను చేయాలని చూస్తున్నాడని కూడా అంటున్నారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని ఇంట్లో బాగా ఒత్తిడి ఉంది అని తెలుస్తుందని చెప్పుకొస్తున్నారు. ఆ నేపథ్యంలో తాను జాతీయ రాజకీయాలకు వెళ్లాలని చూస్తున్నట్లు తెలుస్తోంది అంటున్నారు. కేసీఅర్ ఊహించినట్లుగానే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఉండి ఉంటే ఇప్పటికే కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవారని చెబుతున్నారు. అందుకే ఇప్పుడు మరోసారి జాతీయ రాజకీయాల మీద దృష్టి సారించాలని విశ్లేషిస్తున్నారు.
అందులో భాగమే ముస్లిం పెద్దలతో సమావేశం అంటున్నారు. కాకపోతే తన క్యాబినెట్ మంత్రిగా ఉన్న సీనియర్ నాయకుడు మహమ్ముద్ ఆలీ కి ప్రాధాన్యత ఇవ్వకపోగా ముఖ్యమంత్రి గా తనకు వేసిన చైర్ లాంటిదే ఎంపీ అసదుద్దీన్ కి కూడా వేయడం పై సర్వత్రా చర్చ జరుగుతోంది అంటున్నారు.