– పీకేపైన కేటీఆర్ కు కోపమా..?
– దేశ రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదా..?
– అందుకే కేటీఆర్ రాలేదా..?
– దేశ రాజకీయాల్లో కేసీఆర్ రాణిస్తారా..?
– ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టిస్తున్నారా..?
– కేసీఆర్ వ్యూహం ఏంది..?
– ప్రజల్లో జోరందుకున్న చర్చ
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్రపోషిస్తున్న ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అందులో ముఖ్యంగా రాష్ట్ర మంత్రి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి హాజరైన ఈ భేటీకి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాకపోవడం తో రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జోరందుకుంది. అసలు కేటీఆర్ ఈ భేటీలో ఎందుకు పాల్గొనలేదు..? దాని వెనకున్న రహస్యం ఏంటి..? అన్నట్టు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న నేను ఆయన సూచనల ప్రకారం పనిచేయడం ఏంటి అనే ఈగో ఉందా..? లేక నాకంటే ఆయనకు ఎక్కువ ఏం తెలుసు అనే ఆలోచనతో ఉన్నారా..? అనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. అయితే.. ఎంత పని ఉన్నా.. పార్టీ వ్యవహారాల కంటే ఇతర పనులు ముఖ్యమేమి కాదు కదా అంటున్నారు రాజకీయ పండితులు. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న పార్టీని దేశ రాజకీయాల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా జరుగుతున్న ఈ చర్చకు కేటీఆర్ ఎందుకు దూరం ఎండాల్సి వచ్చిందనే ప్రశ్న అందరిలో మెదులుతోందంటున్నారు విశ్లేషకులు.
ఇదిలా ఉంటే.. 2018 లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్.. పీకే సూచనలతో మరోసారి ముందస్తు ఎన్నికలపై దృష్టి పెట్టిందా..? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే..సారు కారు పదహారు అనే నినాదంతో ముందుకు పోయి బొక్క బోర్లా పడ్డ కేసీఆర్.. ఇప్పుడు అదే స్టార్టజీ ఫాలో అయితే.. సక్సెస్ అవుతారా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతం 16 ఏంపీ స్థానాలను గెలుచుకుంటామని చెప్పి నాలుగు బీజేపీ, మూడు కాంగ్రెస్ కు కట్టబెట్టిన టీఆర్ఎస్.. ఈసారి దేశ వ్యాప్తంగా ఎంపీ స్థానాలలో టీఆర్ఎస్ అభ్యర్ధులను పోటీలో పెట్టే ఆలోచనలో ఉందా..? ఉంటే అది సాధ్యమవుతోందా..? అనే కోణంలో చర్చ జోరందుకుంది.
టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారిస్తే రాష్ట్రంలో ఉన్న అధికారాన్ని కూడా కోల్పోతామనే భయంతో ఈ భేటీ ఇష్టం లేకనే కేటీఆర్ హాజరు కాలేదు అనే వాదన కూడా విశ్లేషకుల్లో నానుడిగా మారింది. మరోవైపు..ఇప్పటికే 2018 ఎన్నిక మ్యానిపెస్టోలో పెట్టిన హామీలేం నెరవేర్చలేదనే విషయం ప్రజల్లోకి తీసుకెళ్లాయి ప్రతిపక్షాలు. ఇప్పటికే గ్రామీన స్థాయి ప్రజల్లో కూడా టీఆర్ఎస్ పై వ్యతిరేకత పెరిగిందని పీకే నివేదికలో పేర్కొన్నారనే రూమర్ కూడా తెలంగాణ ప్రజల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే కేసీఆర్.. దేశ రాజకీయాల పేరుతో నాటకం క్రియేట్ చేస్తున్నారా..? అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
మరోవైపు రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదైన నేపథ్యంలో కేసీఆర్ ఏం చేయబోతున్నారు..? ఎవరికి సపోర్ట్ గా నిలువనున్నారు..? అనేది ప్రశ్నార్ధంగా మిగింలింది. ఇప్పటికే మమత బెనర్జీ, శరద్ పవార్లు, లాలు ప్రసాద్ లు ఇప్పటికే తాము పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే కోరికతో అటు మమతతోనూ, ఇటు శరద్ పవార్ తోనూ ఇప్పటికే మంతనాలు జరిపిన కేసీఆర్.. తన మద్దతును ఎవరికి ప్రకటించనున్నారనే చర్చ కూడా వేడిడేడిగా సాగుతోంది.
వీరిలో ఎవరికి మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉండాలనుకుంటున్నాడా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వేళ తటస్థంగా ఉంటే..అది బీజేపీకి కలిసొచ్చే అంశం అనేద కేసీఆర్ కు తెలుసు.. కాబట్టి అసలు కేసీఆర్ నే రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయించాలని పీకే భావిస్తున్నారా..? అందులో భాగంగానే భేటీ నిర్వహించారా..? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. వీటన్నిటి నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో టీఆర్ఎస్ పై 70 శాతం మంది ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారనే నివేదికను కేసీఆర్ కు పీకే అందించారని వాదన ప్రజల్లో గట్టిగా పాతుకు పోయింది. ఈ నేపథ్యంలో సంతరించుకున్న ఈ భేటీలో ఏం చర్చించుకున్నారు..? రాజకీయంగా ఎలా ముందుకు వెళ్తారు..? అత్యంత ప్రాధాన్యత ఉన్న ఈ భేటీకి హాజరుకాకుండా ఎన్నికల్లో ఆయన ఎలా ముందుకెళ్తారనేది..? చర్చనీయాంశంగా మారింది.