ప్రగతి భవన్‌లో టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. వడ్ల కొనుగోళ్లపై జరుగుతున్న పోరాటం, ఆందోళనలపై చర్చించారు. శుక్రవారం రాజ్యసభలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఇచ్చిన సమాధానంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
తెలంగాణ ప్రభుత్వంతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారమే ధాన్యం కొనుగోలు చేస్తామని పీయూష్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రంపై ఎలా ముందుకెళ్లాలి అనే దానిపై నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు కేసీఆర్.