తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేతో భేటీ అయ్యారు. ముందుగా ఛత్రపతి శివాజీ ఎయిర్ పోర్టులో అధికారులు కేసీఆర్ బృందానికి స్వాగతం పలికారు. అక్కడి నుంచి గ్రాండ్ హయత్ హోటల్ కు వెళ్లిన కేసీఆర్.. ఆ తర్వాత థాక్రే ఇంటికి వెళ్లారు.
కేసీఆర్, థాక్రే భేటీ అయి.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ముఖ్యంగా మోడీ సర్కార్ విధానాలపై సీఎంలిద్దరూ చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత, ఎంపీలు రంజిత్ రెడ్డి, సంతోష్, బీబీ పాటిల్, సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా పాల్గొన్నారు.
అంతకుముందు.. గ్రాండ్ హయత్ హోటల్ లో కేసీఆర్ ను కలిశారు ప్రకాష్ రాజ్. కాసేపు ముచ్చటించిన తర్వాత తనతోపాటు తీసుకెళ్లారు.
థాక్రేతో భేటీ తర్వాత ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో కేసీఆర్ భేటీ కానున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ విధానాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు సహా పలు అంశాలపై చర్చలు జరపనున్నారు.