దసరా పండుగ శుభదినాన తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా మారింది. ఈ మేరకు కేసీఆర్ అధికారిక ప్రకటన చేశారు. టీఆర్ఎస్ పేరును మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు 283 మంది టీఆర్ఎస్ ప్రతినిధులు ఈ తీర్మానంపై సంతకం చేశారు. 8 రాష్ట్రాలకు చెందిన నేతలు టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు.
8 రాష్ట్రాలకు చెందిన నేతలు టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. ఏకగ్రీవ తీర్మానాన్ని కేసీఆర్ చదివి వినిపించారు. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. టపాసులు పేలుస్తూ స్వీట్లు పంచుకుంటున్నారు.
మరోవైపు టీఆర్ఎస్ పార్టీ పేరు మార్పుపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అభినందనలు తెలిపారు. తెలంగాణ సీఎంఓ, టీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ ఖాతాలను ట్యాగ్ చేస్తూ టీఆర్ఎస్ జాతీయ పార్టీగా రూపాంతరం చెందింది.. నా శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.