ఆర్టీసీ సమ్మె తో కేసీఅర్ మైండ్ బ్లాక్ అయింది. విధులలో చేరండి అని ఒకటికి రెండు సార్లు డెడ్ లైన్ పెట్టినా కార్మికులు చేరలేదు అంటే యూనియన్స్ ప్రభావం నాయకుల ఇన్ఫ్లెన్స్ కార్మికుల మీద చాలా బలంగా ఉంది. ఇది కేసీఅర్ కి మింగుడుపడలేదు.ఎలాగైనా కార్మికులను యూనియన్స్ కు దూరం చేయాలి. నాయకులను కార్మికులను విడదీయలని ముఖ్యమంత్రి భావించారు. అందుకే సమ్మె విరమణ తరువాత డిపో కి ఐదుగురు చొప్పున కార్మికులను ప్రగతిభవన్ కి పిలిపించుకొని వారితో సుధీర్ఘంగా సమావేశం అయ్యి వారితో కలసి భోజనం చేసి వాళ్ళను అచికబుచిక చేశాడు అంటున్నారు జేఏసీ నాయకులు.
పైగా అప్పుడే రెండు సంవత్సరాల పాటు గుర్తింపు సంఘం ఎన్నికలు పెట్టేది లేదు అనికూడా ప్రకటించారు. ఇప్పుడు కార్మికుల చేత మాకు రెండేళ్లు ఎన్నికలు అవసరంలేదు అని అప్లికేషన్స్ పెట్టించి వాటిని లేబర్ డిపార్ట్మెంట్ కి సమర్పించి కార్మికులే గుర్తింపు సంఘ ఎన్నికలు అవసరంలేదు అంటున్నారు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. తాను కలలు కన్న ప్రైవేటీకరణ కాలేదు. తనకు ఇష్టమైన వారికి కొన్ని రూట్స్ ఇవ్వాలనుకుంటే యూనియున్స్ సమ్మె పేరుతో అడ్డుపడ్డారు. అన్నివైపుల నుండి ఒత్తిడి తెచ్చారు. అటు న్యాయస్థానం, ఇటు కేంద్రం తోపాటు రాజకీయ ఒత్తిడి తేవడంతో తాత్కాలికంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ప్రైవేటీకరణను వాయిదా వేసుకోవడమే కాకుండా తనకు అటువంటి ఆలోచనలు ఏమీ లేవని కేసీఅర్ కార్మికులకు చెప్పుకొచ్చారు. అడిగినవి, అడగని హామీలను కూడా అమలు చేస్తున్నట్లు ప్రకటించి కార్మికుల హృదయాలను దోచుకునే ప్రయత్నం చేసారు. కార్మికులు తన ఇన్ఫ్లుయెన్స్ కిందకు వచ్చారని భావించినప్పుడు వారిచేత తాను అనుకుంటున్న వాటిని అమలు చేయించే ప్రయత్నం మొదలుపెట్టారు అంటున్నారు నాయకులు.
ఇవ్వాళ గుర్తింపు సంఘం ఎన్నికలు అవసరంలేదు అని కార్మికుల చేత సంతకం పెటిస్తారు రేపు సంస్థలో పోటీతత్వం ఉండాలి అప్పుడే సంస్థకు లాభాలు వస్తాయి, అందుకే కొన్ని రూట్స్ ప్రైవేటు వారికి ఇవ్వాలి అని కూడా కార్మికుల చేతే సంతకాలు చేయిస్తారు అంటున్నారు. అలా వారి వేలుతో వారి కంటిని పొడుచుకునే లా కార్మికులను తయారు చేస్తారని, అందుకే వారిని ప్రగతిభవన్ కి పిలిచి భోజనాలు పెట్టారని, యూనియన్స్ ఉంటే సంఘటిత శక్తిగా ఉంటారు, ఎదైనా సమస్య వస్తే అందరు కల్సి చర్చించుకొని నిర్ణయం తీసుకుంటారు, యాజమాన్యం మీద, ప్రభుత్వం మీద పోరాడుతారు, హక్కులు సాధించుకుంటారు. కార్మికులు ఇలా ఐక్యంగా ఉన్నంత కాలం మనం ఏమి చేయలేం అని ఏబై రోజులకు పైగా జరిగిన సమ్మెతో కేసీఅర్ కి అర్దం అయింది. అందుకే ఓ వైపు కార్మికులకు వరాలు ప్రకటిస్తూనే మరోవైపు సంఘాలను లేకుండా చేయాలనే తలంపుకూడ చేశారని అంటున్నారు. అందులో భాగమే ఎన్నికలు వద్దు అంటూ కార్మికుల చేత సంతకాలు చేయించుకుంటున్నారు అని చెపుతున్నారు కార్మికులు.
ప్రభుత్వం కేసీఅర్ చెక్కర్లో పడితే తమ భవిష్యత్ ను కేసీఅర్ కి తాకట్టు పెట్టినట్లే అంటున్నారు. సమ్మె తో ప్రైవేటీకరణ కు పడ్డ అడ్డుకట్టను కార్మికులను లొంగదీసుకోవడం ద్వారా యూనియన్స్ ను సంస్థ లో లేకుండా చేయడం ద్వారా తొలగించుకొని వచ్చే రెండేళ్లలో అదే కార్మికుల చేత కేసీఅర్ ప్రైవేటీకరణ కు మేము వ్యతిరేకం కాదు అని కార్మికుల చేత చెప్పించే ప్రయత్నం చేస్తున్నారని జేఏసీ నాయకులు అంటున్నారు. కార్మికులారా జాగ్రత్తగా ఆలోచించుకోండి… మీ భవిష్యత్ ను మీరే ఫణంగా పెట్టుకుంటారా… లేక ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారో మీకే వదిలేస్తున్నాం అంటున్నారు. ఏమి జరుగుతుందో చూడాలి.