భార్య అలిగింది. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్న భర్త మారాలని ఇంటికి రానంది.
భర్త భార్యను సెల్ఫ్ విడాకులు తీసుకుంది అన్నాడు.గడువులు పెట్టి ఇంట్లోకి రాకుంటే అటే అన్నాడు.తాగడం పెంచాడు. పిల్లలు ఎలా చచ్చినా తనకు సంబంధం లేదన్నాడు.పండుగ ముందు ఇల్లు వదలటం తప్పు అన్నాడు.
మరో దానిని ఇంటికి తెచ్చి పెట్టాడు.
పెద్దమనుషులు కూడా భర్తను శాసించలేమన్నారు.
పరిస్థితి బాగాలేదని భార్య ఇంట్లోకి వచ్చి కాపురాన్ని బాగుచేసుకుంటానంది.
ఇంట్లోకి రావద్దన్నాడు ఆ కసాయి.
అయినా భార్య ప్రాధేయపడింది.
దుర్మార్గుడు రౌడీలను పెట్టి మరీ భార్యను ఇంటికి రానివ్వలేదు.
భార్య కన్నీరు మున్నీరయ్యింది.
దిక్కు లేని పరిస్థితి.
అప్పుడు తాగుబోతు భర్త ఏ ముడ్ లో ఉన్నాడో కానీ భార్యను ఇంట్లోకి ఆహ్వానించాడు.
అందరూ భర్తను మెచ్చుకోలుగా చూశారు…
ఇదీ నేటి న్యాయం