పాలనైనా, పార్టీ అయినా నా ముద్రే ఉండాలి. నేను చెప్పిందే శాసనం నామాటే వేదం అన్నట్లుగా కేసీఅర్ వ్యవహారం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అది ఉద్యమ సమయంలో అయినా… నేడు పాలనలో అయినా బాస్ ఇజ్ ఆల్ వేస్ కరెక్ట్ అనేవిధంగా ఉండాలి అనేది ఆయన ధోరణిని గా ఉందంటున్నారు.
కేసీఆర్ ఉద్యమ సమయంలో పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసినా తాను చెప్పిందే నడవాలి, నేను చెప్పినట్లే నిర్ణయాలు తీసుకోవాలి అన్నట్లు వ్యవహరించాడు. జేఏసీ చైర్మెన్ గా ఉన్న కోదండరాం వ్యతిరేకించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కేసీఆర్‌ను కాదని మిలియన్ మార్చ్, సాగరహారం వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకోవడం లాంటి కార్యక్రమాలు కూడా చేశారు. దీంతో కేసీఆర్ కు కోపం వచ్చి కొన్ని నెలలపాటు కోదండరాం తో మాటలు లేవు. ఆయనకు కనీసం అపాయ్మింమెంట్ కూడా కేసీఆర్ ఇవ్వలేదు. ఇలా ఉద్యమ సమయంలో అంతా తాను చెప్పిందే వినాలి అన్నట్లు వ్యవహరించాడు. పార్టీ వ్యవహారాల విషయంలో కూడా కేసీఆర్ చెప్పిందే వేదం. రాష్ట్ర కమిటీ నిర్ణయాలు, జిల్లా కమిటీలు ఉండవు. సమిష్టి నిర్ణయాలు ఉండవు. ఎవరు ఏమి చెప్పేది ఉండదు చెప్పినా వినేది ఉండదు.
పార్టీలో నేతలు ఎదైనా చెప్పాలనుకున్నా అసలు చెప్పే అవకాశమే ఇవ్వడు. పార్టీ హాల్ అండ్ సోల్ తానే చూసుకుంటాడు. పార్టీ పెట్టిననాటి నుండి నేటివరకు ఇదే పరిస్థితి. నా పార్టీ నా ఇష్టం అన్నట్లు ఉంటుంది కేసీఅర్ స్టయిల్. ఇక పాలన సంగతి సరే సరి. మంత్రులంతా డమ్మీ. పేరుకే మంత్రులు వారికి కేటాయించిన శాఖలలో కూడా వారు సొంతగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఉందన్న ప్రచారం జోరుగా ఉంది. అధికారులు కూడా అంతంత మాత్రంగానే మినిస్టర్స్ మాట వింటున్నారు. మంత్రులు చేసేది లేదు చెప్పేది లేదు మంత్రులుగా ఉన్నామంటే ఉన్నామనట్లుగా అప్పుడప్పుడు అక్కడక్కడా తమ గోడు వెళ్లబోసుుకుంటునారు అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
పేరుకే మంత్రులు తప్ప వారికేమి అధికాలు లేవు అని చెబుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఆర్టీసీ సమ్మె విషయంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అంతా తానై వ్యవహరిస్తున్నాడు. సమీక్షా సమావేశాలలో రవాణాశాఖ మంత్రి పాత్ర నామమాత్రమే. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేక్షకపాత్ర అని చెప్పొచ్చు. సమ్మె విషయంలో ఎవరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేశారని తెలుస్తోంది. కేసీఅర్ నైజం అంతే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆయన మొదటినుండి తానే సర్వం అనే ధోరణిలో ఆయన వ్యవహారం ఉండేది అంటున్నారు. పార్టీ వ్యవహారాలు అయినా ఉద్యమ సమయంలో జేఏసీ వ్యవహారంలో అయినా ఇప్పుడు పాలన వ్యవహారాల లో అయినా అంతా నా ఇష్టం అన్నట్లుగా ఉంటుంది అని కొందరు సీనియర్ రాజకీయ నాయకులు చెప్పుకొస్తున్నారు. ఇది ఎంతకాలం ఇలా నడుస్తుంది అంటే నడిచినంత కాలం నడుస్తుంది. ఎప్పుడో ఒకప్పుడు కుప్పకూలుతుంది అని ఆ సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు. కూలితే మాత్రం మళ్లీ కోలుకోవడం కష్టం అంటున్నారు.
ప్రజలకు కేసీఆర్ మీద నమ్మకం ఉన్నంత కాలం, ఆయన గురించి పూర్తిగా అర్థం కానంత కాలం, ఎలాగంటే అలా నడుస్తుంది. కేసీఆర్ గురించి ఆయన వ్యవహారశైలి గురించి పూర్తిగా అర్థం అయ్యాక కష్టం అంటున్నారు. అదికూడా ఎంతో కాలం లేదు అంటున్నారు. రెండో సారి అధికారంలోకి వచ్చాక ప్రజలకు కేసీఆర్ ఎంటో తెలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.