ఇమేజ్ పెంచుకోవడం అంటే ఇదా! - Tolivelugu

ఇమేజ్ పెంచుకోవడం అంటే ఇదా!

యాదాద్రిలో కేసీఆర్, కేసీఆర్ కారు, కేసీఆర్ కిట్.. మాత్రమే కాకుండా బూతు బొమ్మలు కూడా పెట్టించి వరల్డ్ ఫేమస్ అయిపోయిన వివాదం అందరూ మరచిపోకముందే మరో కొత్త కాంట్రవర్సీకి తెరలేచింది.

హైదరాబాద్ : కేసీఆర్ ముద్ర తెలంగాణ రాష్ట్రమంతటా కనిపిస్తోంది. కాకపోతే, పరిపాలనలో కాదు సుమా! తన ‘వ్యక్తిగత’ ఇమేజ్ అన్నింట్లో కనిపించాలని దొర గారు మాంచి దూకుడు మీదున్నారు. యాదాద్రి ఆలయంతో పాటు ఆధునిక దేవాలయంగా అభివర్ణించే నాగార్జున సాగర్‌లో కూడా తన శిల్పాన్ని చెక్కించుకున్నారు.
నాగార్జునసాగర్‌లో నిర్మాణ దశలో ఉన్న బుద్ధ వనం మహాస్తూపం. దానిపై సీఎం కేసీఆర్‌ చిత్రం! బుద్ధుడికి కేసీఆర్‌ పుష్పాంజలి ఘటిస్తున్నట్టుగా దీన్ని మలిచారు. ఐతే, సారుకు కాలం కలిసిరావడం లేదు. ఎంచక్కా శిలలపై బొమ్మలు చెక్కించుకుని చిరకాలం తన కీర్తిని పదిలం చేసుకోవాలంటే ఈ మీడియా ఒకటి అడ్డొచ్చింది. బుద్ధవనం మహాస్తూపంపై బుద్ధుడి జాతక కథలు, బాబా సాహెబ్ అంబేద్కర్, జవహర్ లాల్ నెహ్రూ బొమ్మల సరసన చిరకాలం తన బొమ్మ చూసుకోవాలని చెక్కించుకున్న కేసీఆర్‌కు మీడియా దెబ్బకు ఆశాభంగం తప్పలేదు. యాదాద్రిలో బొమ్మల వ్యవహారం వివాదంగా మారడంతో నాగార్జునసాగర్‌లో వుంచిన ఈ శిల్పాన్ని కూడా అప్పటికప్పుడు మార్పించారు. విమర్శలు వెల్లువెత్తడంతో కేసీఆర్ బొమ్మవున్న భాగాన్ని తొలగించారు. అక్కడికి ఎవరినీ ఎంటర్ కాకుండా గట్టి పోలీస్ సెక్యూరిటీ పెట్టారు. మొత్తం మీద రోజుకో మేటర్ బయటపడుతోంది. ఇంకా ఎక్కడెక్కడ ఎలాంటి బొమ్మలు చెక్కిస్తున్నారో ఏమో..! ఇమేజ్ డ్యామేజ్ అంటే ఇదే!

, ఇమేజ్ పెంచుకోవడం అంటే ఇదా!

తొలగించక ముందు

, ఇమేజ్ పెంచుకోవడం అంటే ఇదా!

కేసీఆర్ బొమ్మ తొలగించాక..

Share on facebook
Share on twitter
Share on whatsapp