మంగళవారం పరకాల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. అకాల వర్షాల కారణంగా జరిగిన పంట నష్టంను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించనున్నారు. పరకాల మండలం, నడికూడ మండలంలో ఈ పర్యటన సాగనుంది.
మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి , నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కలిశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని నేను స్వయంగా పంట నష్టం జరిగిన పంట పొలాల దగ్గరకు వస్తానని హామీ ఇచ్చారు.