కేసీఆర్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారా…? పట్టుదల వీడి 50వేల కుటుంబాల బాగోగులను ఆలోచిస్తారా…? 18 రోజుల తర్వాత కూడా అంతే పట్టుదలతో ఉంటారా…? ఇప్పుడివే ప్రశ్నలు ఆర్టీసీ కుటుంబాలను, ప్రయాణికులను వెంటాడుతున్నాయి. ఓవైపు ప్రగతిభవన్‌లో ఆర్టీసీ సమ్మె, భవిష్యత్ కార్యచరణపై సీఎం సమీక్ష కొనసాగుతోంది. దీంతో… కేసీఆర్ నిర్ణయం కోసం లక్షలాదిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రెండు గంటలుగా సీఎం కేసీఆర్ తో మంత్రి పువ్వాడ, సీనీయర్ అధికారుల సమీక్ష కొనసాగుతోంది.