సీఎం కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలకు హెచ్చరికలు చేశారా…? భూతగాదాలకు దూరంగా ఉండమని ఆ హెచ్చరికల సారాంశమా…? ఎమ్మార్వో హత్య ఘటన తర్వాత టీఆర్ఎస్ కొంత డిఫెన్స్‌లో ఉందా…?
టీఆర్ఎస్ నేతల మాటలు వింటే అవుననే సమాధానం వస్తోంది. ఎమ్మార్వో విజయారెడ్డి హత్య ఉదంతం తర్వాత టీఆరెఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు, నేతలకు సీఎం కేసీఆర్ హెచ్చరికలు పంపినట్లు తెలుస్తోంది. అధికార పార్టీలో ఉన్నాం కదా అని భూతగాదాలకు వెళ్లకండి, ఏమాత్రం తేడా వచ్చిన పార్టీకి చుట్టుకుంటుంది. భూతగాదాలు, ఆరోపణలు సహించేది లేదని మెసెజ్ పంపినట్లు చర్చ నడుస్తోంది.
ఎమ్మార్వో విజయారెడ్డి హత్య సమయంలో స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయన నిజంగానే ఉన్నారా లేదా అనేది పక్కన పెడితే… అక్కడ ఎమ్మెల్యేతో పాటు పార్టీ, ప్రభుత్వం కూడా బద్నాం అయింది. కాబట్టి ఇలాంటి విషయాలను ఊపేక్షించేది లేదని తేగేసి చెప్పినట్లు టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఎలాగైతే ఎమ్మార్వోలు కాస్త డిస్టెన్స్ మెయింటెన్ చేస్తూ ఆర్జీలు తీసుకుంటున్నారో… భూతగాదాల పంచాయితీల విషయంలో ఎమ్మెల్యేలు కూడా కాస్త డిస్టెన్స్ మెయింటెన్ చేస్తున్నారని తెలుస్తోంది.
ఇక రియల్ రంగంలో కీలకంగా ఉన్న టీఆర్ఎస్ ద్వితియ శ్రేణి నాయకులు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలపై కాస్త ఒత్తిడి తెస్తున్నా… నేతలు మాత్రం కాస్త ఆగండి బాబు అని సర్ధిచెప్తున్నారని తెలుస్తోంది.