బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు,
మాజీ బీజేపీ అధ్యక్షులు ఇంద్రసేనా రెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు. పీఆర్టీయు నుంచి గెలిచిన జనార్దన్ రెడ్డి ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి ఏవియన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలి. ఆయన గెలుపు కోసం అందరం కృషి చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులకు కరెక్ట్ టైంకు జీతాలు ఇవ్వలేక పోతున్నారు కేసీఆర్. ఆయనకు కొన్ని ఉద్యోగ సంఘాలు వంత పాడుతున్నాయి.
ఏ సంఘము నుంచి ఎవరు గెలిచినా అధికార పార్టీకి వత్తాసు పలుకుతారు. కాబట్టి టీచర్లు ఆలోచించి ఓటు వేయాలి. ఒక్క ఏవియన్ రెడ్డి గెలిస్తేనే ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడుతారు. ఆయనకే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించుకోవాలి. తెలంగాణా రాష్ట్రంలో జరుగునున్న టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా ఏవియన్ రెడ్డిని ఇప్పటికే బీజేపీ ప్రకటించింది.