హైదరాబాద్: కేసీఆర్ కేబినెట్‌లో ఆరుగురు కొత్త మంత్రులు కొలువుదీరనున్నారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన గవర్నర్ తమిళి సై కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఇప్పటికే ఖరారుచేసిన ఆ ఆరుగురు మంత్రుల పేర్లను ముఖ్యమంత్రి కార్యాలయం రాజ్‌భవన్‌కు పంపించినట్టు సమాచారం. కేటీఆర్, హరీశ్‌రావు, పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ పేర్లు ఈలిస్టులో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో వున్న శాఖలే కేటీఆర్‌కు కేటాయిస్తారని అంటున్నారు. హరీశ్‌రావుకు కీలకమైన ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించే అవకాశం వుంది. అజయ్ పువ్వాడకు వైద్యశాఖ ఇస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో వ్యాధులు విజృంభిస్తున్న పరిస్థితులలో ఈటలను తప్పించి ఆ శాఖను అజయ్‌కు అప్పగిస్తారని అంటున్నారు.