రాములమ్మపై కేసీఆర్ జాలి

కాంగ్రెస్ నేతలు వ్యవహరించిన తీరుని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రస్తావించారు. ఇంత అసహనమెందుకధ్యక్షా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను హైదరాబాద్ పై రాజీపడిఉంటే, తెలంగాణ మూడునాలుగేళ్ల ముందే వచ్చేదని కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పారు. పాపపు పనులన్నీ వాళ్ల మెడకు పెట్టుకుని శాసనసభలో ఇంతరాద్ధాంతం సృష్టిస్తారా అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలది అహంకారమన్నారు కేసీఆర్. పాపం విజయశాంతి అంటూ ఆమెపై జాలి చూపించారు. విజయశాంతికి మాయమాటలు చెప్పి తమ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి కండువాకప్పి లాక్కుపోయి ఆమెను అడవులపాలు చేశారంటూ  కాంగ్రెస్ నేతల్ని విమర్శించారు కేసీఆర్.