వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కేసీఆర్ సర్కాస్ పై విరుచుకుపడ్డారు. రాష్ర్టంలో ఎక్కడ చూసినా కరెంట్ కోతలే ఉన్నాయన్నారు. కేసీఅర్ మిస్ మ్యానేజ్మెంట్ కారణంగా.. విద్యుత్ వ్యవస్థను భ్రష్టు పట్టాయని ఆమె ఫైర్ అయ్యారు. కేసీఅర్ కి యాసంగి సీజన్ పై ఎటువంటి ప్లానింగ్ లేదని విమర్శించారు.
24 గంటలు కరెంట్ అవసరం ఉందని కాని ఎక్కడా కూడా 5 గంటలు కూడా విద్యుత్ సరిగ్గా రావడం లేదన్నారు. 26 లక్షల మోటర్ల కింద 50 లక్షల ఎకరాలు సాగు అవుతున్నాయని, 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం అని కేసీఅర్ ఊదర గొడుతున్నారని మండిపడ్డారు. రైతులు తీవ్ర భయాందోళన లో ఉన్నారని.. పంటలు ఎండిపోతున్నాయి అని ఆందోళనను చేస్తున్నారని షర్మిల అన్నారు.
కేసీఅర్ ఇలాకా గజ్వేల్ లో కూడా 24 గంటల కరెంట్ లేదని, రైతులు ఆందోళనలు చేస్తుంటే కేసీఅర్ అండ్ కో కళ్ళకు గంతలు కట్టుకొని కూర్చున్నారని మండిపడ్డారు. ఇంతవరకు కరెంట్ కోతలపై ప్రభుత్వం నోరు విప్పడం లేదన్నారు. పైగా కేసీఆర్ పచ్చి అబద్ధాలు..గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మొదటి నుంచి కేసీఅర్ కరెంట్ విషయంలో పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు.
మనది కరెంట్ సర్ప్లస్ స్టేట్ అని చెప్తున్నారని..రెప్ప పాటు కూడా కరెంట్ పోదు అని చెప్తున్నారని.. న్యూయార్క్,లండన్ ,ప్యారిస్ లో కరెంట్ పోతది కానీ తెలంగాణ లో పోదు అని గారడీ మాటలు చెప్తున్నారని అన్నారు. కేసీఆర్ మొత్తం కరెంట్ వ్యవస్థను బ్రష్టు పట్టించారని, పవర్ డిస్ట్రిబ్యూటరీ కంపెనీలను దివాళా తీయించారని,కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసమే 5 వేల కోట్లు కరెంట్ బిల్లులు కట్టాల్సి ఉందని షర్మిల విమర్శించారు.
ఒక సీజన్ లో 50 వేలు..మరొక సీజన్ లో 70 వేల ఎకరాలకు ఇచ్చిన సాగునీరు కోసం వేల కోట్ల కరెంట్ బిల్లులు ఎలా..? అని ఆమె నిలదీశారు. Spdcl,npdcl కంపెనీలను కేసీఆర్ దివాళా తీయించాడని.. ఈ కంపెనీల బ్యాలెన్స్ షీట్ చూస్తే..2021 వరకు 43 వేల కోట్ల నష్టం ఉందన్నారు. ఈ రోజు వరకు తీసుకుంటే..ఈ నష్టం 50 వేల కోట్లు దాటిందన్నారు షర్మిల. సర్కార్ ఇవ్వాల్సిన బాకీలు చెల్లించడం లేదని.. రాష్ట్రంలో కరెంట్ ఉత్పత్తి పై,కొనుగోలు అంశాల పై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.