హైదరాబాద్: చూస్తుంటే నరసింహన్ హైదరాబాద్ వదిలిపెట్టేలా లేరు. రెండు రాష్ట్రాల ఏర్పాటు, విభజన అంశాల విషయంలో తమకు ఎంతో మేలు చేసిన నరసింహన్ సేవల్నికేసీఆర్ వినియోగించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టున్నారు. ప్రభుత్వ సలహాదారుగా నియమించుకోవాలనే తన ఆలోచనను ముఖ్యమంత్రి కేసీఆర్ నరసింహన్ దగ్గర ప్రస్తావించారని కూడా సమాచారం. తెలంగాణకు కొత్త గవర్నర్‌ను ప్రకటించిన విషయం తెలియగానే, కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లి నరసింహన్‌ను కలిసి మాట్లాడి వచ్చారు. ఇన్నాళ్లు గవర్నర్‌గా సహాయ సహకారాలు అందించినందుకు ప్రత్యేకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పనిలోపనిగా తన ప్రతిపాదన గురించి ప్రస్తావించినట్టుగా చెబుతున్నారు.