తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. సికింద్రాబాద్‌లోని యశోదా హాస్పిటల్‌కు వెళ్లనున్నారు. ఊపిరితిత్తుల్లో మంటగా (lungs burning)గా ఉందని చెప్పడంతో ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎం.వి. రావు, శ్వాసకోశ నిపుణుడు డాక్టర్ నవనీత్ సాగర్ రెడ్డి, హృద్రోగ నిపుణుడు డాక్టర్ ప్రమోద్ కుమార్ ముఖ్యమంత్రికి ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఎం.ఆర్.ఐ, సిటి స్కాన్ లాంటి పరీక్షలు అవసరమని ఆయనతో చెప్పారు. వైద్యుల సూచన మేరకు యశోద ఆసుపత్రిలో వెళ్లి కేసీఆర్ ఆయా పరీక్షలు చేయించుకోనున్నారు.