తెలంగాణలో ఆర్టీసి సమ్మె తీవ్ర రూపం దాలుస్తుంది. ప్రభుత్వం సమ్మెను ఆపే ప్రయత్నం కాకుండా…ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. కేసీఆర్ చేసే సమీక్షల్లో కూడా ఇదే చెబుతున్నారు. కోర్ట్ ముందు గట్టి వాదనలు వినిపించాలని సూచనలు చేస్తున్నారు. కానీ హై కోర్ట్ ముందు ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలు బయట పడ్డాయి. సంబంధిత మంత్రి, అధికారులు చెప్పిన వివరాలకు పొంతన లేకపోవడంతో హై కోర్ట్ ప్రభుత్వాన్ని కడిగేసింది. ఇది కేసీఆర్ అసహనం కి కారణమైంది.
అసెంబ్లీలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆర్టీసీకి ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉందని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. కానీ హై కోర్టు లో అధికారులు ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువే ఇచ్చామని వాదించారు. దీంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
దీనిపై శుక్రవారం కేసీఆర్ మంత్రి, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అసలు ఎం జరుగుతోందని ఆరా తీశారు. పొంతన లేని వివరాలు కోర్టుకు సమర్పించి, ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చిపెడుతున్నారని ఆగ్రహం, అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.