వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన కేసీఆర్ ఈ వరదలు అంతర్జాతీయ కుట్ర అన్న విషయం తెలిసిందే. దీని గురించి ఇప్పటికే విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. తాజాగా దీని గురించి మాజీ మంత్రి శశిధర్ రెడ్డి మాట్లాడారు. భారీ వర్షాలు పడడం అంతర్జాతీయ కుట్ర అని కేసీఆర్ చెప్పడం బాధాకరమైన విషయమన్నారు.
గతంలో లడఖ్, ఉత్తరాఖండ్ లో క్లౌడ్ బరస్ట్ జరిగిందని తర్వాత గోదావరి పరివాహక ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ జరిగిందని కేసీఆర్ అన్నారు. క్లౌడ్ బరస్ట్ జరిగితే గంటకు వంద మిల్లీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావాలి. అలా అయితే దానిని క్లౌడ్ బరస్ట్ అంటారు. ఉత్తరాఖండ్ లో కూడా క్లౌడ్ బరస్ట్ జరగలేదు. వర్షపాతాన్ని కొలిచే పరికరాలు మనవద్ద లేవు. కేసీఆర్ వద్ద ఏదైనా సమాచారం ఉంటే కేంద్రానికి ఇవ్వండన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో బాహుబలి పంపులను అమర్చామన్నారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వరదలు వచ్చినప్పుడే ఆ ప్రాజెక్టు తట్టుకుంది. కర్ణాటక, మహారాష్ట్రలో అధిక శాతం వర్షపాతం నమోదైంది. ఆ వరదల వల్లే మనకు భారీ వరద సంభవించింది. కేసీఆర్‌ను బద్నామ్ చేయడానికి కాళేశ్వరంలో వరద వచ్చేలా చేశారని అనుకోవడం బాధాకరమన్నారు.
80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్‌కు వర్షాలు ఎలా పడతాయో తెలీదా.. హరిజంటల్ మూమెంట్ ద్వారా సునామీ రాదని నేను ఎన్‌డీఎమ్ ఏ వైస్ ఛైర్మన్ గా ఉన్నప్పుడే చెప్పాను. ఇంకో పదివేల పుస్తకాలు చదివితే కేసీఆర్ కు ఆ తెలివి వస్తుందని సలహా ఇస్తున్నాను. నిన్న కేసీఆర్ పక్కనే ఉండి సీఎస్ ఏం సమాచారం ఇచ్చారు.
విపత్తుల సమయంలో సీఎస్ అనేక కార్యక్రమాలు చేపట్టాలి. అది చేయడం లేదు. 8 ఏళ్లు అయినా కూడా స్టేట్ స్థాయిలో విపత్తుల నిర్వహణ మీటింగ్‌లు పెట్టడం లేదు. కేసీఆర్ డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నారు. కేసీఆర్ అలా మాట్లాడటం సరికాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఫోర్స్ వచ్చిందంటే అది కూడా మా హయాంలో ఏర్పాటు చేసిందే..రానున్న రోజుల్లో నగరాల్లో పట్టణాల్లో భారీ వరదలు వస్తాయి.. దానికి సిద్ధంగా ఉండండి. రాష్ట్ర సర్కార్ విపత్తులు ఎదుర్కోడానికి వున్న గైడ్ లైన్స్ పాటించండంటూ శశిధర్ పేర్కొన్నారు.