ఇటీవల వెలుపడుతున్న పలు సర్వేలపై ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ స్పందించారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారని ఆయన అన్నారు. ఇటీవల బీజేపీ, కాంగ్రెస్‌లు చేయించిన సర్వేలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయని ఆయన చెప్పారు. ఎనిమిదేండ్ల పాలన తర్వాత కూడా టీఆర్‌ఎస్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు.
నాయకుల మధ్య గొడవలు తమ పార్టీలో పోటీ తత్వాన్ని చాటుతున్నాయని చెప్పారు. బలమైన నేతలను తమ పార్టీ కలుపుకుని పోతుందన్నారు. రాష్ట్రమంతటా టీఆర్ఎస్ పార్టీయే ఉందన్నారు. రాష్ట్రంలో 90కి పైగా స్థానాల్లో తమ పార్టీ విజయ కేతనం ఎగురవేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తమది దొరల కుటుంబం అన్న ప్రతిపక్షాల విమర్శలకు ఆయన ఘాటుగా సమాధానం ఇచ్చారు. తాను కానీ తన తండ్రి కానీ దొర అయితే ఎంత మందిని జైళ్లో వేశామని ఆయన ప్రశ్నించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లను ఇస్తామని ఆయన ప్రకటించారు. దేశంలోనే
బీజేపీపై ఆయన మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంచి పనులతో ప్రజల మనసులు గెలుచుకోవడం బీజేపీకి తెలియదన్నారు. బీజేపీ డబుల్ ఇంజిన్ మోడీ,ఈడీ అని ఎద్దేవా చేశారు. వాపును చూసి కొందరు బలుపు అనుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఎవరికీ బెదరడు, లొంగడని చెప్పారు.