మాజీ సీఎల్పీ నాయకుడు జానారెడ్డి కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ మాయ మాటలు చెప్పి, మూటల సంచులతో వచ్చి గెలుస్తున్నాడని ఆయన ఆరోపించారు. అనుముల కేంద్రంలో హాథ్ సే హాథ్ జోడో యాత్రలో పాల్గొన్న ఆయన ఈ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
లక్షల ఎకరాలకు సాగు నీరు అందించింది తానేనని అన్నారు జానారెడ్డి. కేంద్రంలో మోడీ, తెలంగాణలో కేసీఆర్ లు పోలీసుల ద్వారా బెదిరిస్తున్నారని విమర్శించారు. దళితుల మూడెకరాల భూమి హామీ ఏమైందని.. ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ ఏమైందని నిలదీశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అరాచకాలు, మోసాలను ప్రజలకు వివరించడమే ఈ యాత్ర ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. అధికారం లేకున్నా మీకు అండగా తోడుగా నిలుస్తున్నానని జానారెడ్డి తెలిపారు. అనుముల గ్రామంలో ప్రజాశక్తితో తాను చెక్ డ్యాం నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడి ప్రజల దీవెనతో రాష్ట్రానికి సేవ చేసే భాగ్యం తనకు దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు ఆయన.