సీఎం కేసీఆర్‌పై మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర పథకాలను సొంత పథకాలుగా సీఎం కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు.
తెలంగాణ, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ విలువలను కాలరాస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ఎంప్లాయిమెంట్ స్కీమ్ కింద కేంద్రం ఇచ్చిన నిధులను పలు ప్రాంతాల్లో ఖర్చు పెట్టలేదన్నారు.
మల్కాజ్ గిరి, నల్గొండ ప్రాంతాలకు చెందిన సుమారు రూ. 12 కోట్ల నిధులు వెనక్కి పోయాయని తెలిపారు. విద్యా, వైద్యం ఇతర రంగాల్లో అభివృద్ధి కోసం కేంద్రం కొన్ని కోట్లు విడుదల చేసిందన్నారు.
కానీ కేసీఆర్ సర్కార్ మోడీ సర్కారుపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని ఆయన మండిపడ్డారు.