వెస్టిండీస్ స్టార్ క్రికెటర్, పరిమిత ఓవర్ల కెప్టెన్ కీరన్ పొలార్డ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్లు బుధవారం ప్రకటించాడు. అయితే, ప్రస్తుతం ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న పొలార్డ్.. ప్రైవేట్ టీ20, టీ10 లీగ్స్‌లో మాత్రం ఆడతానని తెలిపాడు.
2007లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌తో వెస్టిండీస్ జట్టులోకి అడుగుపెట్టిన పొల్లార్డ్ అల్ రౌండర్‌గా రాణించాడు. విండీస్ జట్టుకు కెప్టెన్‌గా ఉండటం తన జీవితంలో మరపురాని అనుభూతిగా పొలార్డ్ అభిప్రాయపడ్డాడు. అన్ని విధాలుగా ఆలోచించిన మీదటే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పొలార్డ్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. కేవలం 34 ఏళ్ల వయస్సులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించటం క్రికెట్ అభిమానులకు ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
‘బాగా ఆలోచించి అంతర్జాతీయ క్రికెట్ రిటైర్ కావాలని నిర్ణయించుకున్నా. వెస్టిండీస్‌కు ఆడాలని 10 ఏళ్ల వయసు నుంచే కల కన్నా. టీ20, వన్డే ఫార్మాట్లో 15 ఏళ్ల పాటు విండీస్‌కు ప్రాతినిధ్యం వహించినందుకు గర్వపడుతున్నా’ అని తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పొలార్డ్ పేర్కొన్నాడు.
అయితే, టీ20ల్లో భీకర బ్యాట్స్‌మన్‌గా పేరున్నా.. వెస్టిండీస్ తరఫున అతడి రికార్డు మాత్రం గొప్పగా లేదు. ఇప్పటివరకు అంతర్జాతీయ కెరీర్‌లో 123 వన్డేలు ఆడిన పొలార్డ్ 2,706 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు అంతర్జాతీయ టీ20ల్లో 101 మ్యాచ్‌లు ఆడి 1,569 పరుగులు చేశాడు. ఇందులో ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే కెరీర్‌లో ఒక్క టెస్టు కూడా పొలార్డ్ ఆడలేదు. ఓవరాల్ ఐపీఎల్‌లో పొలార్డ్ 16 హాఫ్ సెంచరీలు చేశాడు. అత్యధిక స్కోరు 87గా ఉంది.
Advertisements