రాజమౌళి కుటుంబసభ్యులు అందరు సినిమా రంగానికి చెందినవారే…రాజమౌళి, కీరవాణి… వారి కన్నా ముందు నుండి కూడా సీనీరంగంలో ఉన్నవారే. కీరవాణి కొడుకు కాలభైరవ కూడా గాయకుడిగా రంగప్రవేశం చేశారు. ఇప్పుడు తాజాగా కీరవాణి చిన్న కొడుకు సింహ హీరోగా రాబోతున్నాడు. మైత్రి మూవీస్ బ్యాక్ ఎండ్ లో ఈ సినిమాని నిర్మిస్తుంది. కోటి రూపాయల బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాకి “మత్తువదలరా ” అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమా కి మ్యూజిక్ డైరెక్టర్ గా కాలభైరవ పరిచయం అవుతున్నాడు.
మరోవైపు రాజమౌళి కుమారుడు కార్తికేయ కూడా నిర్మాతగా మారి ఆకాశవాణి సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.