సరిలేరు నీకెవ్వరూ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అయితే ఆ తరువాత తన 27వ సినిమా వంశీ పైడిపల్లితో చేస్తున్నాడు అని వార్తలు వచ్చాయి. అయితే తరువాత అనూహ్యంగా మహేష్ వంశీ తో కాకుండా గీతగోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు అని వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. అయితే ఇంకా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో మహేష్ కు జంటగా కీర్తి సురేష్ నటిస్తుందని అంటున్నారు. మహానటి సినిమాతో దేశ వ్యాప్తంగా విమర్శకులను సైతం మెప్పించిన కీర్తి సురేష్ అయితే కథకు బాగుంటుందని దర్శకుడు పరశురామ్ అనుకుంటున్నాడట.
అయితే ఈ విషయం లో ఎంత నిజం ఉందొ మాత్రం తెలియదు. అయితే ప్తస్తుతం కరోనా కారణంగా అని సినిమా షూటింగ్ లు వాయిదా పడిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ కారణంగా ఈ విషయానికి సంబంధించిన విషయం తెలియడానికి ఆలస్యం అవుతుందని సమాచారం.