మహానటి ఫేం కీర్తి సురేష్ ఇటీవల విడుదలైన సినిమాల్లో కాస్త బొద్దుగా కనిపించింది అన్న టాక్ వచ్చింది. పెంగ్విన్, మిస్ ఇండియాలో కీర్తి సురేష్ ను చూసిన సర్కారు వారి పాట టీమ్ ఆమెను రీప్లేస్ చేయబోతున్నారన్న ప్రచారం కూడా సాగింది.
తాజాగా కీర్తిసురేష్ కు సంబంధించిన వార్త ఫిలింనగర్ సర్కులేట్ అవుతుంది. కీర్తి సురేష్ మళ్లీ గతంలో మాదిరిగా కనిపించేందుకు చమటోడ్చుతున్నారని, బరువు తగ్గటంపై ఆమె సీరియస్ గా దృష్టిపెట్టినట్లు టాక్ వినిపిస్తుంది.