గుడ్ లక్ సఖి సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది కీర్తి సురేష్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీ గా గడుపుతుంది. అయితే తాజా కీర్తి తన కొత్త మ్యూజిక్ వీడియో గాంధారి తో అభిమానులను ఆనందపరచడానికి సిద్ధంగా ఉంది.
ఇదే విషయాన్ని చెప్తూ… సోనీ మ్యూజిక్ సౌత్ ప్రొడక్షన్ హౌస్, ది రూట్‌కి ధన్యవాదాలు తెలిపింది కీర్తి సురేష్. లవ్ స్టోరీ మ్యూజిక్ డైరెక్టర్ పవన్ సిహెచ్ ఆ మ్యూజిక్ వీడియో కు సంగీతం సమకూర్చారు.
ఫిబ్రవరి 21న ఈ పాటను విడుదల చేయనున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే సర్కారు వారి పాట సినిమా చేస్తుంది కీర్తి సురేష్ . ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన కళావతి సాంగ్ రిలీజ్ అయ్యి అందరినీ ఆకట్టుకుంది.
అలాగే చిరంజీవి భోళా శంకర్, నాని దసరా సినిమాలో కూడా నటిస్తుంది.