మహానటితో సావిత్రి జీవితాన్ని చూపించిన కీర్తి సురేష్ పుట్టిన రోజు సందర్భంగా నగేష్‌కుమార్ దర్శకత్వంలో తెలుగులో చేస్తోన్న చిత్రం ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు నిర్మాతలు. మహానటి సినిమాతో సీనీ విమర్శకులను సైతం మెప్పించిన కీర్తి సురేష్ కేరీర్ ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో దూసుకపోతుంది. అందం, అభినయంతో బాలీవుడ్‌లోనూ సినిమా చాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం అజయ్ దేవగణ్ హీరోగా చేస్తోన్న మైదాన్ సినిమాలో నటిస్తోంది.
తెలుగులో తెరకెక్కుతోన్న చిత్రంపై దీపావళి నాడు పూర్తి వివరాలు వెల్లడించబోతుంది నిర్మాణ సంస్థ. ఈ చిత్రంలో జగపతిబాబు, ఆదిపినిశెట్టి కూడా నటిస్తున్నారు.