కీర్తి సురేష్… మహానటి తర్వాత బిజీగా హీరోయిన్ గా మారిపోయింది. సౌత్ ఇండియన్ భాషల్లో కీర్తికి ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. అయితే, కీర్తి సురేష్ ఇప్పుడు ఇద్దరు సూపర్ స్టార్స్ తో సినిమా చేసేందుకు రెడీ అని ప్రకటించింది.
అయితే, సూపర్ స్టార్ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ప్రకటించటంతో… తన చేతిలో ఉన్న మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. దీంతో నిర్మాతలు వీలైనన్ని ఎక్కువ డేట్స్ ఇవ్వాలని కోరగా, కీర్తి ఓకే చెప్పారని… త్వరలోనే హైదరాబాద్ లో షూటింగ్ మొదలుకానుందని తెలుస్తోంది.
ఇక తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబుతోనూ కీర్తి సినిమా చేస్తోంది. సర్కారు వారి పాట కోసం జనవరి నుండి డేట్స్ ఇచ్చేందుకుక రెడీ అయ్యింది. దీంతో ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ తో ఆడి పాడనున్న ఈ అమ్మడు… టైం ఎలా అడ్జెస్ట్ చేస్తుందో చూడాలి.