మహానటి ఫేం కీర్తి సురేష్ యంగ్ హీరో నితిన్‌తో కలిసి రంగ్ దే సినిమా చేస్తుంది. రంగ్ దే టీం ఇప్పుడు దుబాయ్ లో షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నారు. షూటింగ్‌తో తమకు చెమటలు పడుతుంటే కీర్తి మాత్రం హ్యాపీగా రిలాక్స్ అవుతోందంటూ సినిమా సెట్లో కీర్తి నిద్రపోతున్న ఫొటోను హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ అట్లూరి సోషల్ మీడియాలో షేర్ చేయగా, పిక్ వైరల్ అయ్యింది.
తాజాగా ఫోటోపై కీర్తి సురేష్ మరోసారి స్పందించింది. ఆ ఇద్దరిపై పగ తీర్చుకుంటానని శపథం చేసింది. అన్నట్టుగానే డైరెక్టర్ వెంకీ అట్లూరిని సినిమా సెట్లో పరుగులు పెట్టించింది. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఒకరి పని అయింది.. ఇంకొకరు ఉన్నారు. నితిన్ త్వరలోనే నీపై పగ తీర్చుకుంటానని కామెంట్ చేసింది. ఈ కామెంట్‌కు స్పందించిన నితిన్.. ఐయామ్ వెయిటింగ్ అని రిప్లై ఇచ్చాడు.
View this post on Instagram